భువిపై వెలసిన దేవత
అమ్మే భువిపై వెలసిన దేవత.
మాతృదేవోభవ అని అందుకే
అంటారు. నవమాసాలు మోసి
బిడ్డను కనే అమ్మను మించిన
దైవం ఉంటుందా. ప్రసవం సమయంలో ఆమె పడే
నెప్పిని పంటిబిగువుతో ఓర్చుకుని పండంటి బిడ్డను
కనే తల్లి నిజంగా గొప్పది. ప్రతి ప్రసవం ఆమెకు పునర్జన్మ
లాంటిందే. బిడ్డను కన్నాక
తను పడిన బాధనంతా
మర్చిపోయి బిడ్డను చూసి
తృప్తిగా నవ్వే అమ్మ ఎంత
గొప్పదో కదా. కన్న బిడ్డలను కంటికి రెప్పలా కాపాడుకునే
ఆమెను ఏమని పొగడాలి.
బిడ్డల భవిష్యత్తు కోసం
తమ జీవితాన్ని త్యాగం
చేస్తుంది అమ్మ. తాను
తిన్నా,తినకపోయినా
బిడ్డల కడుపు నిండితే
చాలనుకునే అమ్మను
అన్నపూర్ణ అనాల్సిందే.
తన సంపదనంతా పిల్లల
భవిష్యత్తు కోసం ఖర్చు
పెట్టే అమ్మను లక్ష్మీదేవి
అనాలేమో. పిల్లలకు మొదటి గురువు అమ్మ. ఆమెను
సరస్వతీ దేవి అనాల్సిందే.
మనుషులలో చెడ్డవాళ్ళు ఉంటారేమో గానీ చెడ్డ అమ్మ
ఉండదు. నిజంగా అలాంటి
అమ్మలందరికీ శతకోటి
వందనాలు.🙏
-వెంకట భానుప్రసాద్ చలసాని