భీమ్లా నాయక్ రివ్యూ

భీమ్లా నాయక్ రివ్యూ

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి మెయిన్ క్యారెక్టర్స్ లో నటించిన, అయ్యప్పన్ కోషియం అనే మలయాళం సినిమా కి రీమేక్ సినిమా అయిన భీమ్లానాయక్ ఎలా ఉందో చూద్దాం.

కథ:- పవన్ కళ్యాణ్ భీమ్లానాయక్ కర్నూల్ డిస్ట్రిక్ట్ లో ఎస్సై లాగా పని చేస్తూ ఉంటాడు. డ్యూటీని దైవంగా భావిస్తూ చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్ గా ఉంటాడు. తనకి భార్య ఒక చిన్న పిల్లాడు కూడా ఉంటాడు.

ఒక రోజు తను ఫారెస్ట్ చెక్పోస్ట్ దగ్గర పని చేస్తూ ఉంటే, కార్లో మందు తాగి డానియల్ శేఖర్ (రానా) ఒక రిటైర్డ్ ఆర్మీ మ్యాన్ అక్కడికి వస్తాడు.

నిజానికి అక్కడికి మందు నాట్ అలౌడ్. మందు తాగి రావడమే కాకుండా తన కార్లో చాలా మందు బాటిళ్ళు దొరుకుతాయి. అందువల్ల భీమ్లా నాయక్ శేఖర్ ని అరెస్ట్ చేస్తాడు.

ఈగో హార్ట్ అయిన శేఖర్ తన పవర్ ఏంటో చూపిస్తానని సవాల్ విసురుతాడు. ఆ ప్రాసెస్ లో ఏమైంది? ఈ భీఖర యుద్ధంలో ఎవరు గెలిచారు ? అన్నది సినిమాలో చూడాలి. 

నటీనటులు:- పవర్ స్టార్ పవన్ కళ్యాన్ ఎప్పటిలాగే సూపర్ గా నటించారు. నిత్యా మీనన్ కి, సంయుక్తా మీనన్ కి చిన్న క్యారక్టర్ లే దొరికినా ఆ సీన్స్ లలో చక్కగా నటించారు.

విలన్ రానా దగ్గుబాటి కూడా పవన్ కళ్యాన్ తో పోటి పడుతూ నటించాడు. సపోర్టింగ్ రోల్స్ లలో చేసిన, రావు రమేష్, మురళి శర్మ, సముద్ర ఖని లు కూడా బాగున్నారు. స్టోరి అంతా కూడా రానా, పవన్ ల మధ్య జరుగుతుంది. 

విశ్లేషణ:- ముందుగా చెప్పినట్టు ఇది మలయాళ సినిమా కి రీమేక్. ఆల్రెడీ వకీల్ సాబ్ లాంటి రీమేక్ హిట్ ని తీసి ఫాం లో ఉన్న పవన్ కళ్యాన్ ఈ సినిమాకి కూడా ఎ మాత్రం తగ్గలేదు.

ఫస్ట్ హాల్ఫ్ కొంచం ల్యాగ్ గా అనిపిస్తుంది. కానీ సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి కథ పుంజుకుంటుంది. నిజం చెప్పాలంటే ఆయప్పం కోశియం సినిమాలో ఎక్కువ ఫైట్స్ ఉండవు.

చివర్లోనే ఒక పెద్ద ఫైట్ ఉంటుంది. కానీ ఈ సినిమాలో అలా కాకుండా కొన్ని ఫైట్ పెట్టుకున్నారు. దాంతో పాటు కొన్ని పవర్ ఫుల్ డైలాగ్స్ కూడా ఎక్కువ ఇంపాక్ట్ క్రియేట్ చేసాయి.

పాటలు ఇంకా బాగా తీయొచ్చు అని అనిపిస్తుంది. అలాగే ఇద్దరు పెద్ద హీరో లని హ్యాండిల్ చెయ్యడం అంటే మామూలు విషయం కాదు. ఒక్క దగ్గర ఫ్యాన్స్ బాధ పడేలా చేసినా కూడా సినిమా ఫ్లాప్.

కానీ ఆ విషయం లో డైరెక్టర్ సాగర్ కే చంద్ర, రైటర్ త్రివిక్రమ్ ఎక్కడా కూడా మనం డిసప్పాయింట్ అవ్వకుండా జాగ్రత్త పడ్డారు.

భీమ్లా నాయక్, డానియల్ శేఖర్ సవాళ్ళు విసురుకునే సీన్స్, ఫైట్స్ కూడా మనల్ని మెప్పిస్తాయి. ట్రైలర్ లో ఉన్న బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ధియేటర్ లో బాగుంది.

ఫస్ట్ హాల్ఫ్ లో అంతగా అనిపించకపోయినా ప్రీ-ఇంటర్వెల్ నుండి పూనకాలు వచ్చేలా చేసాడు మ్యూజిక్ డైరెక్టర్ థమన్. ప్రీ క్లైమ్యాక్స్ లో ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఉంటుంది. అది కూడా మనల్ని అట్రాక్ట్ చేస్తుంది. 

చివరగా:- పవన్ కళ్యాణ్, రాణా దగ్గుబాటి, సినేమానంతా తమ భుజాలపై నడిపారు. మీరు గనక అయ్యప్పం కోశియం సినిమా గనక చూసి ఉంటె మీకు నచ్చక పోవచ్చు. కానీ ఆ సినిమా చూడని వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు. 

ప్లస్ పాయింట్స్:- 

పవన్ కళ్యాణ్, రాణా దగ్గుబాటి పర్ఫార్మెన్స్

బ్యాగ్రౌండ్ మ్యూజిక్ పవర్ఫుల్ డైలాగ్స్

స్క్రీన్ ప్లే

మైనస్ పాయింట్స్:-

ఓవర్ గా అనిపించే యాక్షన్

ఫస్ట్ హాల్ఫ్ లో కొంత ల్యాగ్

 

రేటింగ్:- 4/5

 

పంచ్ లైన్:- బ్లాక్ బస్టర్ భీమ్లా

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *