భయకరమైన నిజం
జలుబు, కారటం,అనే జలపాతాలలొ
ముక్కు, కళ్లు ఏకమై హోరు చేస్తాయి.
ఆ హోరులో చెవులు గింగురు మంటాయి.
గాలి పీల్చలేక నోరు,హోరు పెడ్తుoది.
గాలి తక్కువై ఉక్కిరి బిక్కిరైపోతాయి
ఊపిరి తిత్తులు.
వత్తిడికి గురై ముక్కు ఎర్రబారి
మండుతుంది.
మధ్యలో తుమ్ము తమ్ముడొచ్చి
చిరంజీవి అనిఎవరో ఆనంగవిని,
గుండెకు హయ్ చెప్పిపారిపోతాడు.
ఈ గొడవలో ఇప్పుడెందుకని దగ్గు
ఓపిక లేక ఒకసారి దగ్గి,తగ్గి ఉంటుంది.
మెదడు నేను పని చేయను బాబోయ్!
అని మొరాయిస్తుంది.
మూడు రోజుల్లో అదే ఆగుతుందిలే
అంటాడు డాక్టర్.
తుడవటం తన పని కాదు,ఎవరి ముక్కు
వారే తుడుచుకోవా లంటాడు.
ఇదే ఒక భయంకరమైన నిజం
😂😂😂
– రమణ బొమ్మకంటి