భవిష్యత్తు బాగుండాలంటే
మన భవిష్యత్తు బాగుండాలంటే మనమే కృషి చేయాలి. ఇతరుల సాయం
కూడా అవసరమే కానీ మన
ప్రయత్నం మనం చేయాల్సిందే.
వర్తమానంలో కృషి చేయడం
వలన బంగారు భవిష్యత్తు
మన సొంతం అవుతుంది.
గతాన్ని తవ్వుకుని బాధపడి
లాభం లేదు. గతంలో జరిగిన
చెడు సంఘటనలు మనకు గుణపాఠం అవుతాయి. ఆ
గుణపాఠాలే మన జీవితానికి
వెలుగు చూపే దివ్వెలు సుమా.
కేవలం అదృష్టాన్ని నమ్ముకుని
బ్రతికితే కష్టం. అదృష్టం అనేది
అప్పుడప్పుడు మాత్రమే మన
ఇంటి తలుపు తడుతుంది. ఆ
తలుపు తట్టిన అదృష్టాన్ని
గౌరవంగా ఇంటిలోనికి స్వాగతించాలి. ఇంట్లోనే
ఉండే దురదృష్టాన్ని తరిమి
కొట్టాలి. అది పోనని మారాం
చేస్తుంది. అయినా బలవంతంగా తోసెయ్యాలి.🙂
ఇక ఆ పనిలో ఉండండి అందరూ 🙏
-వెంకట భానుప్రసాద్ చలసాని