భార్య
పసుపుతాడుతో పుట్టినిల్లు వదిలి మెట్టినింటి అడుగుపెడుతుంది
అర్దనారి అయి అలనాపాలనా చూస్తుంది
ఇసుమంతా కష్టం భర్తకు వచ్చిన క్షణక్షణం తల్లడిల్లిపోతుంది
సిరులిస్తానన్న శ్రీవారిని వదలదు
నీ ఓటమికి తన కన్నీళ్లు ప్రతీకౌతాయి
నీ గెలుపుకి తన సంతోషం దర్పణమౌతుంది
కాపురంలో కష్టాలున్న,ఇడుముల నడుమ నలిగిపోతున్న
కన్నవారింటి గడప తొక్కినప్పుడు
వికసించిన కుసుమంలా పెదవిపైన నవ్వు నటిస్తుంది
శ్రీమతిగా సంసారసాగారాన్ని దాటాటానికి చేయుతనిస్తుంది
కారు చీకట్లో దారిచూపే దీపమౌతుంది
ఓడిపోయిన మనసుకి ఓదార్పనిస్తుంది
నీ ఏకాంతాన్ని చెరిపే తోడవుతుంది
అమ్మతో సమానంగా చూసుకునేది ఆలి మాత్రమే..
పేరులేని కవి
కవి పేరు ఆర్.రాము (ఆత్మరవికిరణం)