బందిఖానాలు
నోరు ఉంది కదా అని ఇతరుల ,
మనోభావాలు దెబ్బ తినేలా మాట్లాడడం తప్పు.
కానీ అందరికీ మనోభావాలు ఉంటాయి
ఎవ్వరూ తెలుసుకోలేరు.
కొందరు అవి తెలుసుకోకుండా మనోభావాలు
దెబ్బ తినేలా చేస్తారు.
వాళ్ల మనోభావాలను దెబ్బతీయడం
వల్ల నీకు వాళ్ళు దూరం అవుతారు.
నా చుట్టూ ఉన్న సమస్యలను
పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేస్తున్న ప్రతిసారి ,
నా భర్త నా మనోభావాలను ఇంకా బాధ పెడుతూ,
నన్ను నా వాళ్ళని కించపరుస్తూ ,
నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించకుండా ,
నీ వాళ్ళదే తప్పుంది నాది ఏం
మాత్రం తప్పులేదు అని గర్వంగా చెప్పుకుంటూ ,
నన్ను ఇంకా బాధకి గురి చేస్తూ ,
గొడవలు జరిగిన ప్రతిసారి నువ్వు మానసికంగా లోనయ్యి ,
నువ్వు ఏమైపోతావో అని నీ బాధపడుతూ ,
ప్రతిక్షణం నీ బాగే నేను కోరుకుంటూ ,
జరిగిన వాటిని మర్చిపోయి
నాతో సంతోషంగా ఉండమని కోరితే,
ప్రతి క్షణం ఏదో ఒక మాటలతో నన్ను
ఇంకా బాధ పడుతూనే చేస్తున్నావ్.
నీ మీద ఉన్న గౌరవం కూడా రోజురోజుకి నాకు పోతుంది.
జీవితం అన్నాక గొడవలు జరగకుండా ఉండవు.
కానీ వాటిని తల్చుకుంటూ ప్రతిక్షణం నువ్వు నన్ను బాధ పెట్టడం ,
నా మనోభావాలను దెబ్బతీస్తున్నావని నువ్వు తెలుసుకోలేకపోతున్నావు.
ఇంకెప్పుడు నన్ను అర్థం చేసుకుంటావు.
నువ్వు ఈరోజు కాకపోయినా రేపైనా అర్థం ,
చేసుకుంటావని ఆశతో బతుకుతూ ఉన్నాను.
మా వాళ్ళు చేసింది తప్పే అని నేను ఒప్పుకున్న
కూడా నువ్వు ఆ గొడవని మర్చిపోకుండా
గుర్తు చేసుకుంటూ నన్ను బాధ పెడుతున్నావు.
నీలో మార్పు కోసం ఎదురు చూస్తూ ,
నువ్వు ఎప్పుడైనా అర్థం చేసుకుంటావని అనుకుంటూ ,
సంసారం అనే బందిఖానాల్లో నీకోసం ఎదురు చూస్తూ ఉన్నాను.
-మాధవి కాళ్ల