బాహుబలి
విరిసీ విరియని ఆలోచనలతో
నువ్వుంటావు
నిన్నుచూసిన ఉదయం సందేహపడుతుంటుంది
బద్దకాన్ని మోసే బాహుబలివి ఎప్పుడయ్యావని
చుట్టూ మనుషుల సందోహం
తమ దేహాలను వేడుకచేస్తూ!
మాట దాల్చిన మౌనం వేదికగా
ఆలోచనలన్నీ భేటీ అవుతాయి
బేపర్వా బతుకును అన్వేషిస్తూ
మౌనం,ఉదయం,ఆలోచనల పోటీతో
మనసును మంచం పట్టనివ్వకు
తనువును సందిగ్థంలో పడేయకు
నీడల ప్రపంచానికి రాజువు కాబోకు
-సి.యస్.రాంబాబు
రచన బాగుంది.