భారత రాజ్యాంగ దినోత్సవం
మహనీయుల త్యాగ ఫలం
మన భారత రాజ్యాంగం
భావి భారత పౌరులకు
దిశా నిర్దేశం మన రాజ్యాంగం
పరిధులు చెప్పే పంచాంగం
శాసనాల శంఖారావం
ప్రజాస్వామ్య ప్రభుత్వాలు
అందరికీ సమ న్యాయం
చట్టాల చిట్టాలు
హక్కుల వివరాలు
భాద్యతల వివరణలు
పౌరులకోసం ప్రభుత్వాల రక్షణ
హక్కులు భాద్యతలు అందరికోసం
సమాజ సంక్షేమమే లక్ష్యం
సంపదపంచడమేసమన్యాయం
అందరికీ అవకాశాలు అనేది
అభివృద్ధి పై ఆధారం
చట్టాల సవరణలు
వివాదాల కూర్పులు
వ్యవస్థల నియమాలు
నిరోధించే అంశాలు
ప్రజల కోసం ప్రగతి పథంలో
నడవడానికి లిఖించిన గ్రంధం
నవభారత నిర్మాణానికి
నాణ్యమైన రాజ్యాంగం మనది
వర్ధిల్లుతోంది రాజ్యాంగం అంతటా బహుముఖ ప్రజ్ఞగా……?
– జి జయ