భారతదేశ గొప్పదనం
సర్వ మతాలు, సర్వ ప్రాంతాలు, సర్వ కులాలు, సర్వదేవతలు, సకల ప్రాంతాల వర్గాల వారు బ్రతకగలిగే ఏకైక దేశం మన భారతదేశం. భారతదేశం అన్ని మతాలను అన్ని కులాలను అన్ని వర్గాలను ప్రాంతీయ బేదం లేకుండా ఆదుకునే, అన్నం పెట్టే ఒక అన్నపూర్ణ బ్రతకలేని వానికి పని ఇచ్చి వాడికి జీవితాన్ని చూపించగలిగే గొప్ప దేశం మన భారతదేశం శత్రువైన అతిధి దేవోభవ అని అంటూ శరణు వచ్చిన వారికి అవేమిచ్చే కల్పవృక్షం మన భారతదేశం.
ఎన్నో మతాలవారు, ఎన్నో కులాల వారు ఇక్కడ బ్రతకగలుగుతున్నారు అంటే అది మన దేశ గొప్పతనం ఎవరైనా మనుషులే అంటూ సాటి మనిషికి గౌరవం ఇచ్చేది మన భారతదేశం ఒక్కటే. పేద, గొప్ప తేడా లేనిది బీద, బిక్కి చూడనిది మనుషులకు విలువ నిచ్చేది వారిని అన్నివేళలా కాపాడుకునేది భారతదేశం. రాజుల కాలం నుంచి ఈనాటి రాజకీయ నాయకుల వరకు ఎవరైనా సరే మమ్మల్ని బ్రతికించండి అంటూ వస్తే దగ్గరకు తీసుకొని వారికి ఎంతో కొంత సాయం చేయడం మన రక్తంలోనే ఉంది.
భారత దేశ గొప్పతనమే అది అప్పుడప్పుడు కొట్లాటలు, గొడవలు సహజమే అయిన మళ్లీ భాయి, భాయి అని అనుకుంటూ కలిసిపోవడం కూడా మన రక్తంలోనే ఉంది. భారత ఖండం భరతుని పరిపాలన వలన మనకి భారత ఖండం అనే పేరు వచ్చింది అని మనం చిన్నప్పుడు చాలా పుస్తకాల్లో చదువుకున్నాం. అలాంటి మంచి మనసు ఉన్న భరతుడు పాలించిన ప్రాంతం కాబట్టి ఎలాంటి వారినైనా క్షమించే తత్వం మన మనస్తత్వంలో పాతుకు పోయింది. భారతదేశంలో అనేక గుడులు గోపురాలు ఉన్నాయి భారతదేశం భక్తికి ఆలయాలకు ప్రసిద్ధి చెందింది అలాగే కొండలకు కోటలకు రాజవంశాలకు ప్రసిద్ధి చెందిన గొప్ప ఆలయం మన భారతాలయం.
భారతదేశం ఎంత గొప్పది అంటే ప్రపంచంలో ఎలాంటి రోగం లేదా వ్యాధి వచ్చిన దానికి సంబంధించిన విరుగుడు కానీ మందు ఎలా తయారు చేయాలి అన్న దాని గురించి మన పురాణాల్లో చాలామంది రాశారు అలాగే చాలామంది ఆయుర్వేద వైద్యం ద్వారా వాటిని ఎలా నివారించాలని వాళ్ల గ్రంథాలలో రాసి పెట్టడం జరిగింది. అలాగే మన పురాణాల ప్రకారం అంటే రామాయణ, మహాభారతాల ప్రకారం చాలామంది చాలా జీవిత పాఠాలు అనేవి నేర్చుకున్నారు ముఖ్యంగా శ్రీకృష్ణుడు చెప్పిన భగవద్గీతతో చాలామంది ఇన్స్పైర్ అయ్యి వాళ్ళ జీవితాలనీ, వాళ్ళ అలవాట్లని వాళ్ళ కట్టుబాట్లని మార్చుకున్నారు.
విదేశాలలో ఉండేవారు సైతం మన భారత దేశ సాంప్రదాయాన్ని పొగుడుతూ ఉన్నారు వాళ్ళు పాటిస్తూ ఉంటారు కొన్నాళ్ళు పనిచేసి మీగితా సమయాల్లో భారతదేశాన్ని సందర్శిస్తూ ఇక్కడ ఆలయాలు, మంచి మంచి ప్రదేశాలను చూస్తూ తన్మయత్వం చెందుతూ ఆ జ్ఞాపకాలను వాళ్ళ మదిలో తుదిలో పదులపరుచుకొని వెళ్తూ ఉంటారు. భారతదేశం అమ్మాయిలను పెళ్లి చేసుకోవడానికి విదేశా విదేశీయులు చాలా ప్రయత్నం చేస్తారు.
అలాగే ఇక్కడ సంస్కృతి సాంప్రదాయాలను వాళ్ళు చాలా గౌరవిస్తారు. ఇలా వాళ్లు గౌరవించడం అంటే మన భారతదేశం ఎంత గొప్పది అనేది మనకు అర్థమవుతుంది. మనకు అర్థం అయినా కూడా మనం మన దేశాన్ని మన చుట్టుపక్కల పరిసరాలను పట్టించుకోకుండా అన్నీ తెలిసిన మనం మాత్రం వాటిని అస్సలు పట్టించుకోకుండా ఫారిన్ కల్చర్ ని ఫాలో అవుతున్నాము.
మన దేశాన్ని మన సాంప్రదాయాలను సంస్కృతులను మరచిపోయి విదేశాల మోజులో పడ్డాము. ఇంత గొప్ప చరిత్ర ఉన్న భారతదేశాన్ని వదిలే విదేశాలకు వలస వెళ్తున్నాం. అక్కడివారు ఇక్కడికి వస్తుంటే ఇక్కడ ఉన్న మనం అక్కడికి వెళ్లాలని ఉవ్వీళ్ళూరుతున్నాం. భారతదేశంలో మరొక గొప్ప సాంప్రదాయం స్త్రీలను గౌరవించబడడం స్త్రీలకు పెద్దపీట వేయడం ఆది కాలం నుంచి స్త్రీలను దేవతలుగా పూజిస్తూ గౌరవిస్తున్నాం అలాగే ఇక్కడ మరో గొప్ప విషయం పువ్వులను పూజించడం అదే మన బతుకమ్మ. అలాగే దుర్గా నవరాత్రులలో అమ్మవారిని పూజిస్తున్నాం.
గంగా, యమునా, సరస్వతీ, నర్మదా, కావేరి నదులంటూ నదులకు కూడా ఆడవారి పేరు పెట్టుకొని వాటిని పూజించడం ప్రతీ ఏటా వారికి పండగలు నిర్వహించడం చేస్తున్నాం. భారతదేశంలో స్వాతంత్రం చాలా ఎక్కువ ఆ స్వాతంత్రాన్ని అందరూ సద్వినియోగం చేసుకోకుండా దుర్వినియోగం చేస్తున్నారు.
ఓ పక్క ఇంత గొప్పగా భారతదేశాన్ని పొగుడుతున్న మరోవైపు భారత దేశంలో ఎన్నో అవినీతి అన్యాయాలు జరుగుతున్నాయి అనడంలో సందేహం లేదు. అది మరొకసారి మాట్లాడుకుందాం ఇప్పుడు మాత్రం మన భారతదేశ గొప్పతనం గురించి ఎంత పొగిడినా ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.
ఈ భారత దేశంలో పుట్టినందుకు అందులోనూ హిందువుగా పుట్టినందుకు నేను చాలా గర్విస్తున్నాను. మనుషులంతా ఒకటే అనే భావం మన భారతదేశం చెప్పదగ్గ ఒకే ఒక మాట మానవులం మనమందరం సాటి మనిషికి సహాయ పడదాం సాటి మనిషి నీ మనిషిలా గుర్తిద్దాం. భారతదేశం నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులు అంటూ గర్వంగా చెప్పుకుంటూ ముగిస్తున్నాను.
– భవ్య చారు