బావతో పెళ్లి

బావతో పెళ్లి

సంధ్య గీత ఇద్దరు అక్కా చెల్లెల్లు..
ఒకరంటె ఒకరికి వల్ల మాలిన ప్రేమ ఇద్దరికీ సంవత్సరమే తేడా! దాంతో ఇద్దరూ ఒకే వయసు వాళ్లలా ఒకే రకంగా కనిపిస్తారు ఒక్క మాటలో చెప్పాలంటె కవల పిల్లల లాగా! అన్నమాట..

ఇక వాళ్లిద్దరికీ ఒక మేన బావ ఉన్నాడు సుధీర్ వాడంటె వాళ్ల నాన్నకు పిచ్చి ఇష్టం..చిన్నప్పటి నుండే సంధ్యను అతనికి ఇవ్వాలని అనుకునే వాల్లు..సంధ్యకేమెా అస్సలు ఇష్టం లేదు బావంటే! ఎందుకో
తెలీదు కానీ బావంటె గిట్టదు అలా పడనప్పుడుపెళ్లి చేసుకుని జీవితాంతం ఎలా ఉంటానే? అంటూ
చెల్లికి చెప్పుకునేది..

మరి నాన్నకు చెప్పేయ్! అక్కా! బావంటే నీ కిష్టం లేదని అంది..అమ్మెా! అలా చెప్తే తిడతాడేమెా! అంది సంధ్య..ఏం కాదులే! ఓ మంచి టైం చూసి చెప్పేయ్! అంది..గీతకు బావంటె ఇష్టం కానీ ఎవరితో చెప్పలేదు..

ఒకసారి టైం చూసి నాన్నకు చెప్పింది..నాన్న నేను బావను పెళ్లి చేసుకోను అని..వెంటనే అగ్గిమీద గుగ్గిలమే అయ్యాడు..ఏం మాట్లాడుతున్నావ్? చిన్నప్పటి నుండి అందరం అనుకున్నాం!
ఇప్పుడు నువ్వేదో చెప్తే నేను వింటానా? అంటూ గట్టిగా
బెదిరించాడు..

నా కిష్టం లేదు నాన్న! అంది ఏడుస్తూ!పోనీ లెండి దానికి వేరే సంబంధం చూసి సుధీర్ కు చిన్న దాన్నిద్దాం! అంది వాళ్లమ్మ..

ఏం మాట్లాడుతున్నావ్? మతి ఉండే మాట్లాడుతున్నావా? అని ఆమెనొక్కటి వేసాడు..
నా నిర్ణయమే ఫైనల్ అంటూ! వెంటనే ముహూర్తాలు కూడా పెట్టించాడు..

పెళ్లి ముహూర్తం దగ్గర కొచ్చాక నాన్న సంధ్య అక్క ఇంట్లోంచి వెళ్లి పోయింది. వేరే అబ్బాయిని పెళ్లి చేసుకుందట గుళ్లో మా ఫ్రెండు ఫోన్ చేసిందని కపటనాటకం ఆడింది గీత..

అయ్యెా! అలా చేసిందా? ఇప్పుడెలా?కళ్లు తాగిన కోతిలా గంతు లేసాడు కోపంగా ఎవరి మీద అరవాలో కూడా అర్థం కాక..

తాళి కట్టడానికి అమ్మాయిని తీసుకు రమ్మంటున్నారుఅవతల పురోహితుడు..నాన్న మీకభ్యంతరం లేకపోతే నేను బావను చేసుకుంటా!బంధువుల ముందు మన పరువు పోకుండా ఉంటుంది
అంది..

ఊ…సరే! ఇప్పుడైతే కానీయ్! తరువాత దాని సంగతిచెప్తా! అన్నాడు పళ్లు కొరుకుతూ!
మనసులో హుర్రే అనుకుంటూ! తాళి కట్టించుకుంది.

పెళ్లయ్యాక బాత్రూం లో దాక్కున్న సంధ్య బయటకు వచ్చింది..నాన్న నువ్వు చూడకుండా నేనెవరిని చేసుకుంటాను?
అని నాన్న ముందుకు రాగానె తన కోపమంతా పటా
పంచలైంది..
చెప్పాను కద నాన్న నాకు బావకు పడదని చెల్లికే బవంటె ఇష్టం అంతే! అంది..
హమ్మయ్య! నా పరువైతే పోలేదని ఆడికే సంతోష పడి తరువాత సంధ్యకు నచ్చిన వాణ్ణి చూసి చేసాడు..
ప్రకాశం…

 

 

-ఉమాదేవి ఎర్రం

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *