భట్లపెనుమర్రు గ్రామం
నాకు నచ్చిన ప్రదేశం నా స్వగ్రామం. నా స్వగ్రామంపేరు భట్లపెనుమర్రు. అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనికృష్ణా జిల్లాలో ఉన్న మొవ్వ మండలంలోని ఒక గ్రామం. భట్లపెనుమర్రు గ్రామంమన జాతీయ పతాక రూపకర్తశ్రీ పింగళి వెంకయ్య గారిజన్మస్థలం. శ్రీ పింగళి వెంకయ్యగారి గౌరవార్థంగ్రామంలోని ప్రధాన వీధికి ఆయన పేరు పెట్టారు. అలాగేగ్రామ నడిబొడ్డున ఆయన విగ్రహం నెలకొల్పారు. అంతే కాకుండా శ్రీ పింగళి వెంకయ్యగారి పేరు మీద గ్రామంలో ఒకపెద్ద కళ్యాణ మండపాన్నిగ్రామస్తులు అంతా కలిపికట్టించుకున్నారు. కళ్యాణమండపం కట్టాలనే ఆలోచన శ్రీ చలసాని శాయోజీరావుగారిది.
దానికి గ్రామంలో ఉన్నప్రజలు సహకరించారు.అది చాలా గొప్ప విషయం.ఈ మధ్యనే శ్రీ పింగళి వెంకయ్య గారి విగ్రహం పక్కనే 110అడుగుల ఎత్తులో జాతీయజండా నెలకొల్పారు. మా
గ్రామం నుండి అనేక మందిభారత స్వతంత్ర సంగ్రామంలోపాల్గొన్నారు. గ్రామంలోని ప్రజలు చాలా శాంతి ప్రియులు.రైతులంతా కష్ట జీవులు. మాగ్రామం పచ్చదనంతో నిండిఉంటుంది.
గ్రామంలో ఎక్కడచూసినా పచ్చని చెట్లు మనకుకనపడతాయి. ఆ ప్రాంతంఅంతా ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొని ఉంటుంది. మా గ్రామంలోకుల మతాలకు అతీతంగా
అందరూ కలసి మెలసి జీవిస్తారు. గ్రామంలోనిశ్రీ వేణుగోపాల స్వామి ఆలయం ప్రసిద్ధి చెందినఆలయం. గ్రామంలో ప్రభుత్వప్రాధమిక పాఠశాలతో పాటుప్రభుత్వ హైస్కూలు కూడా ఉంది. ప్రాధమిక వైద్యశాల,పశు వైద్యశాల, పాల సంఘం,పోస్ట్ ఆఫీసు, వాటర్ ట్రీట్మెంట్ప్లాంట్ మొదలైనవి మా గ్రామంలో ఉన్నాయి. యూనియన్ బ్యాంకు శాఖమా గ్రామంలో ఉంది. గ్రామనడిబొడ్డున గ్రామ సచివాలయం పక్కనే ఒకచెరువు ఉంది. నిజంగా మా గ్రామం స్వర్గతుల్యంగా
ఉంటుంది.
-వెంకట భానుప్రసాద్ చలసాని
భట్లపెనుమర్రు గ్రామం ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లాలో ఉంది.