బతుకు లేక
అనాధగా బతుకు అది
అతుకుల గతుకుల మలుపు
ఆర్తిగా ముద్దకై అర్రులుచాచే దీనావస్థ
దాతనిల్పు ప్రాణాల బిక్షబతుకు
రోడ్డుపక్క చెత్తలోన జననం
మరణమొచ్చువరకు అది ఒక సమరం
పుట్టుకతో పోరాటం నేర్వాలిక్కడ
ఆడపిల్ల అంటే అంగడిసరుకై నరకం
నిలువల్లా తడిమే చూపుల శులాలు
పసిడి మొగ్గలైనా బతుకుదారి లేదాయే
కనుకొనల కన్నీరు తుడిచేవారెవ్వరు…?
బందీఖానా ప్రాయము బలిపశువైన వైనము
ఆకలి చావులు రక్కేటి రాబందుల క్రింద శవాలు
బతుకుతెరువు చూసి బతుకుదాము అన్నా
మా ఆర్తిని వినేదెవ్వరు…?
మాలో మంచి చూసేదెవ్వరు…?
బతుకుదారి లేక బయలుదేరే మరణం దాకా
– వింజరపు శిరీష