బతుకు

బతుకు

 

ఈ మనసు బాగా లేకపోతే మనం మన జీవితం లో కోరేది ఏమి జరగనప్పుడు కోరుకున్నవి రానప్పుడు,దక్కనప్పుడు మన బతుకు భారం అయినప్పుడు అంటే జీవితం లో అనుకున్నట్టు అంటే చదువు,ఉద్యోగం, పెళ్లి లాంటివి జరగనప్పుడు , అనుకోని బాధ్యతలు మీద పడ్డప్పుడు, ఇలాంటి బతుకు మనకొద్దు రా భగవంతుడా అని అనిపిస్తుంది అనుకోకుండా జరిగేవే జీవితం అనే అప్పుడు అర్థమవుతుంది కక్కలేక మింగలేక ఎవరికీ చెప్పుకోలేక చెప్పుకున్నా ఓదార్పు పొందలేక బతుకు భారమైన జీవితాలు ఎన్నో ఇలా జీవితంలో అనుకున్నది కానప్పుడు చేరుకున్న లక్ష్యాన్ని చేరుకో లేనప్పుడు అనుకున్న విజయం సాధించ లేనప్పుడు బతుకు చాలా భారంగా అనిపించవచ్చు ఉదాహరణకి ఒక వ్యక్తిని తీసుకున్నాం.

ఒక భార్య భర్తలు ఇద్దరు తమ ఇద్దరు పిల్లలతో సంతోషంగా ఉన్నదాంట్లో తింటూ పిల్లల్ని చదివించుకుని హ్యాపీ గా ఉంటున్న సమయంలో హఠాత్తుగా ఆ భార్యా భర్తల్లో భర్త కి అనుకోని రీతిలో ప్రమాదం జరిగి ఒక కాలు విరిగిపోతే అప్పుడు ఆ భార్య పరిస్థితి ఎలా ఉంటుంది చూసుకోవాలి అటు చిన్న వాళ్ళ ఇంటి ని అలాగే సంపాదన కోసం ఉద్యోగం నిర్వర్తించాల్సి ఉంటుంది అలా ఉద్యోగం నిర్వర్తిస్తూ భర్తను పిల్లలను ఇంటిని చూసుకునే ఆ వ్యక్తికి ఒక్కసారి నిరాశ నిస్పృహలకు లోనై బతుకు భారంగా అనిపిస్తుంది. ధైర్యం చెప్పే వాళ్ళు లేక ఏం చేయాలో తెలియని స్థితిలో అటు మానసికంగాను శారీరకంగానూ అలసిపోయిన పరిస్థితిలో ఆ వ్యక్తి గాని ఆమె గాని ఇలాంటి నిర్ణయం అయినా తీసుకోవచ్చు,

అందర్నీ చంపి ఆమె లేదా అతను చచ్చిపోవచ్చు లేదా ఆ కుటుంబాన్ని వదిలేసి తాను పారిపో వచ్చు. ఎందుకంటే అప్పటి వరకు ఎంతో సంతోషంగా గడిపిన తమ జీవితాన్ని ఒక్క సారిగా ఒక ప్రమాదం రూపంలో ముంచుకొచ్చిన తట్టుకోలేక ఏం చేయాలో ఎలా ముందుకు వెళ్లాలో ఎవరు చెప్పారు ధైర్యాన్ని ఇవ్వని స్థితిలో ఆమె కానీ అతను కానీ ఇలాంటి ఆలోచన చేయవచ్చు లేదా నిర్ణయం తీసుకోవచ్చు.

ఒకానొక సందర్భంలో తన మనస్సు రాయి చేసుకుని వీరికి ఎదురీదాలి అని అనుకుంటే ఆమె సంతోషంగా తన బాధ్యతలను తనవే అని అని అనుకుంటే ధైర్యం చెప్పే వారు ఎవరూ లేకపోయినా ,వెన్ను దన్నుగా నిలిచేవారు రాకపోయినా తన పిల్లలే తన లోకం అనుకుంటూ వీరికి ఎదురీది మరి జీవితాన్ని బతుకును కొనసాగించవచ్చు.

ఇద్దరు కాదు ముగ్గురు పిల్లలని అనుకుంటే తన ముగ్గురు పిల్లలను చూసుకుంటూ ఉద్యోగాన్ని ఇంటిని చక్కగా నిర్వహిస్తూ తాను సంతోషంగా ఉంటూ తన వాళ్ళని సంతోష పరచవచ్చు. అది ఎప్పుడు జరుగుతుందంటే ఇది నాది అని అనుకున్నప్పుడు వీళ్లకు నేను తప్ప ఇంకెవరూ లేరు అని భావించినప్పుడు ఇలా జరుగుతుంది, కాదనుకుంటే మాత్రం బతుకు భారం అవుతుంది .

-అర్చన

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *