బతుకు

బతుకు

కొందరు

ఆశతో బతుకుతున్నారు
కొందరు
శ్వాసతో బతుకుతున్నారు
కొందరు
ఊహాలో బతుకుతున్నారు
కొందరు
తెలివితో బతుకుతున్నారు
కొందరు
కష్టపడి బతుకుతున్నారు
కొందరు
ఇష్టంతో బతుకుతున్నారు
కొందరు
అజ్ఞానంలోబతుకుతున్నారు
కొందరు
నిజాయితీగాబతుకుతున్నారు
కొందరు
విశ్వాసంతో బతుకుతున్నారు
కొందరు
చీకట్లో బతుకుతున్నారు
కొందరు
యోగంలో బతుకుతున్నారు
కొందరు
స్వార్థంతో బతుకుతున్నారు
కొందరు
మాయలో బతుకుతున్నారు
కొందరు
బాధల్లో బతుకుతున్నారు
కొందరు
అనారోగ్యంతోబతుకుతున్నారు
కొందరు
అంశతో బతుకుతున్నారు
కొందరు
మార్గ దర్శకులుగా
బతుకుతున్నారు
కొందరు
పూట గడపటం కోసం
బతుకుతున్నారు
కొందరు
అభాగ్యులు గా బతుకుతున్నారు
కొందరు
అదృష్టవంతులు గా
బతుకు తున్నారు
కొందరు
ఆదర్శంగా బతుకుతున్నారు
కొందరు
అనాధలుగా బతుకుతున్నారు
కొందరు
అవివేకులుగా బతుకుతున్నారు
కొందరు
అషటైశ్వర్యాల తో
బతుకుతున్నారు
కొందరు బతుకునీడుస్తూ
బతుకుతున్నారు
కొందరు
భాగ్యవంతులు గా
బతుకుతున్నారు
కొందరు
ఏకాకులుగాబతుకుతున్నారు
కొందరు బలహీనులు గా
బతుకుతున్నారు
కొందరు
భవిష్యత్తు లేకుండా
బతుకుతున్నారు
కొందరు
బతుకు పోరాటంగా
బతుకు తున్నారు
కొందరు మాత్రమే
ఆత్మానందం తో
బతుకు తున్నారు.
అందరు భగవంతుని
కర్మ సిద్ధాంతంలో బతుకుతున్నారు మరి ……

– జి జయ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *