బరువైన గుండె గాయం

బరువైన గుండె గాయం

అమ్మా నాన్నలు చూసిన సంబంధం పిల్లాడు బాగున్నాడు. ఎలాంటి దురలవాట్లు లేవు. మంచివాడు అంటూ పదో తరగతి అవ్వక ముందే పెళ్లి చేశారు సుస్మిత కి..

అందమైన ఎన్నో కలలతో అత్తారింటికి బయలు దేరింది సుస్మిత. తల్లి తండ్రులు చెప్పిన మాటలన్నీ ఆకళింపు చేసుకుంది. అత్తారింటికి లో అణిగిమణిగి ఉంది. ఎవరికీ ఏమీ కావాలన్న చేసింది. అత్తగారు, ఆడపడుచులు వంకలు పెడుతున్నా చిరునవ్వు తో భరించింది.

కానీ ఒక్కటే లోపం ఇన్నాళ్లు అయినా భర్త తన దగ్గరికి రాకపోవడం, రాత్రి కాగానే అమ్మా అంటూ అమ్మ దగ్గర పడుకోవడం చేసేవాడు. సరేలే కొన్నాళ్లకు అత్తగారు కొడుక్కు చెప్తారులే అని ఊరుకుంది.

కానీ యేళ్లు గడుస్తున్నా భర్త తన దగ్గరికి రావడం లేదు. ఎందుకు ఇలా నేనంటే ఇష్టం లేదా, ఇష్టం లేనప్పుడు పెళ్లి ఎందుకు చేసుకున్నట్టు అని ఆలోచనలో పడింది. మామగారు హాల్లో పడుకునే వారు. సుస్మిత బెడ్ రూంలో పడుకునేది. భర్త వస్తాడు ఏమో అని తలుపులు దగ్గర వేసి పడుకునేది. రానూ రానూ భర్త, అత్త, ఆడపడుచు ఒకే గదిలో పడుకోవడం మొదలు పెట్టారు.

ఇది ఇంకా విచిత్రంగా అనిపించింది. ఒకరోజు రాత్రి అసలు వీళ్ళు ఏం చేస్తున్నారు అనుకుంటూ కిటికీ రెక్కలు తెరిచి చూసిన సుస్మిత షాక్ అయ్యింది. లోపల మందు తాగుతూ, తింటూ ఒకరి ఒంటి పైన బట్టలు లేకుండా అందరూ నగ్నంగా ఉన్నారు.

(ఇది నిజమైన ఘటన) మరో పక్క భర్త తల్లితో చేయరాని పనులు చేస్తున్నారు. ఒకరి తర్వాత మరొకరు అమ్మ, తర్వాత చెల్లి తర్వాత అమ్మ ఇలా పొద్దుటి వరకు అదే పని, తెల్లారు గట్ల అందరూ తాగిన మత్తులో పడి పోయారు. సుస్మిత అసలు ఇది జీర్ణించుకోలేక పోయింది. గుండె బరువైంది. ఎవరికీ చెప్పుకోవాలో కూడా తెలియని స్థితి, ఎందుకంటే తనకు అన్నదమ్ములు ఉన్నారు. నేనీ మాట చెప్తే నువ్వు కూడా అలాగే చేస్తావా అంటూ అందరూ నన్నే అంటారు.

ఇలా ఆలోచిస్తూ ఉండగా మేము షాపింగ్ కి వెళ్తున్నాం అని భర్త, ఆడపడుచు, అత్త వెళ్ళారు. మామగారు 80 యేళ్ళ వృద్దుడు. తనకు తొందరగా ఆహారం పెట్టాలని అతని గదిలోకి ఆహారం తీసుకుని వెళ్ళింది సుస్మిత. అప్పటికే ఇంట్లో అన్ని తలుపులు మూసిన అతను సుస్మిత రాక ముందే తన బట్టలన్నీ విప్పుకుని (బూతులు రాయక తప్పడం లేదు) . మంచం పై పడుకున్నాడు. అది చూసి సుస్మిత వెంటనే వంటింట్లోకి వెళ్ళింది.

వెనకే అలాగే వచ్చిన అతను ఇంట్లో ఎవరూ లేరు, రాత్రి వారి బాగోతం చూసావు కదా, ఎన్నాళ్ళు అని ఇలా ఒంటరిగా ఉంటావు? రా మనం కలిసి ఉందాం. ఈ రోజుల్లో ఇవన్నీ కామన్ అంతెందుకు నా కూతురు కూడా నాతో చేస్తుంది అంటూ చెప్పడం తో, అవన్నీ వినలేక సుస్మిత చెవులు మూసుకుని, మామయ్య గారు మీరు తండ్రితో సమానం ఇలాంటి మాటలు వద్దు దయచేసి వెళ్ళండి అంది. నువ్వు ఇలా చెప్తే ఎందుకు వింటావూ అంటూ కొడుకు వచ్చాక అతనికి చెప్పాడు.

ఎన్నడూ లేని భర్త రాగానే సిగ్గుల మొగ్గ అయ్యింది. సుస్మిత మొహం పై చీర పువ్వులు వేసి కట్టుకుని తయారవ్వు అన్నాడు. ఇన్నాళ్లకు నా భర్త మారాడు అనుకున్నా సుస్మిత రెఢీ అయ్యి కూర్చుంది. ఇంట్లో లైట్స్ అన్ని ఆపేశారు. గది లోకి ఎవరో వచ్చిన అలికిడి కావడంతో సుస్మిత భర్తనే అనుకుంది. సిగ్గు పడుతూ కూర్చుంది. వచ్చిన వాడు తనని తాకుతూ ఉంటే అదోలా అనిపించింది.తన భర్త కాదేమో అనే అనుమానం కలిగింది.

దాంతో చెయ్యి విదిల్చి పక్కనే ఉన్న టార్చ్ వేసి మొహం చూసింది. అతను భర్త కాదు మామయ్య తండ్రిలా ఆదరించే మామయ్య ఛీ నా భర్త ఇంత నీచుడా అనుకుంది. వెళ్తవ లేదా టార్చ్ తో కొట్టనా అని బెదిరించడంతో ముసలాడు వెళ్లి పోయాడు.

తరవాత భర్త వచ్చి బాగా కొట్టి నీకేంటి నొప్పి సుఖం దొరుకుతుంది. సుఖ పడు అంటూ బాగా కొట్టాడు అయినా తను ఒప్పుకోలేదు. దాంతో టార్చర్ మొదలైంది. అట్లకాడతో వాతలు, సిగరెట్ వాతలు, అన్నం బదులు కంచంలో పెంట, నీళ్ల బదులు మూత్రం ఇవ్వడం మొదలు పెట్టారు.

సుస్మిత తినకుండా తాగకుండా 45 రోజులు నరకం అనుభవించింది. అప్పుడు ఇప్పుడు పక్కింటి వారితో మాట్లాడే సుస్మిత కనిపించక పోవడంతో వాళ్ళు అడిగారు సుస్మిత ఏదని. లేదు పుట్టింటికి వెళ్లిపోయింది అని చెప్పారు. కానీ రాత్రుళ్ళు ఆమె ఏడుపు బాధ బరువైన గుండె రోదన పక్కింటి వారిని ఆలోచించేలా చేశాయి. వాళ్ళు ఎలాగో సుస్మితకు ఏదో హాని ఉందని ఊహించి, వారి తల్లిదండ్రులకు ఉత్తరం రాశారు మీ కూతురు ఇక్కడ బాగాలేదు అని.

దాంతో సుస్మిత తల్లిదండ్రులు ఆలోచనలో పడ్డారు. మనమే వెళ్తే లేదంటారు. కాబట్టి పోలీస్ కంప్లైంట్ ఇచ్చి వారితో వెళ్దాం అని ఆలోచించి అలాగే చేశారు.. పొద్దున్నే పోలీసులతో దిగిన వియ్యపురాలిని చూసి బిత్తర పోయారు అందరూ, పోలీసులు లోపల అంత వెతికారు. సుస్మితను ఇనుప గొలుసులతో కట్టేసి, ఆమె ముందు మల ముత్రలు పెట్టీ ఉన్నాయి.

చాలా రోజుల నుండి తిండి లేకపోవడంతో నీరసంగా ఉంది. దాంతో పోలీసులు ఆమెను ఆసుపత్రిలో చేర్చారు. సుస్మిత తల్లిదండ్రులు అయ్యో మంచి వాడు అని ఇస్తే ఇలా చేశారు అంటూ కన్నీరు మున్నీరు అయ్యారు. ఇన్నాళ్లు బరువైన గుండె బాధను నా తల్లి ఎలా భరించిందో అని గుండెలు పగిలేలా ఏడ్చారు.

కొన్ని రోజుల్లో సుస్మిత కోలుకుంది. ఇప్పుడు సుస్మిత ఏం చేస్తుంది. డివోర్స్ తీసుకునీ తన బ్రతుకు తాను బ్రతుకుతుందా? లేదా భర్తే దైవం అని తిరిగి వెళ్తుందా? తనంతట తాను బ్రతికితే లోకం ఊరుకుంటుందా? సమాధానం మీరే చెప్పండి.

– భవ్య చారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *