బాపు బొమ్మ

 

బాపుబొమ్మ

ఓ బొమ్మా బుట్టబొమ్మా మనసునలా తట్టకమ్మా

కట్టకమ్మా కట్టకమ్మా గాలిలోన కోటలు కట్టకమ్మా

అందనీ చందమామనూ అందుననీ నమ్మించునే

చెంతనే చేర్చి ఆడుకోవచ్చని ఆశలు పుట్టించునే

 

రెక్కలగుర్రం రెపరెపలిడుతూ గాలిలోన తిప్పునే

చుక్కల ఆకాశం చక్కని అవకాశం అని చెప్పునే ౹ప౹

వయసు మర్మమే ఎరుగక వయారమని సర్దుకోకే

వరసతప్పి సొగసుముసుగులో అసలే చిక్కుకోకే

 

కనిపించేవన్నీ కంటికి కనిపించేవన్నీ పాలనూకోకే

వినిపించేవన్నీ వింతగ వినిపించిన వినాలనుకోకే

చ౹౹ రంగులా లోకం రింగు రింగునా ఊహల్లో ఊపునే

పొంగులా పాలపొంగులా కలల్లో ముంచిచూపునే

మదిలోని కలలకు మారాకూ వేయనీకే చిలకమ్మా

ఆదిలోనే అసలు కథకు తాళం వేసి కదలనీకమ్మా…

 

– భరద్వాజ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *