బంగారు భవిష్యత్తు
ఈ కాలంలో ఒకరు లేక ఇద్దరు పిల్లలనే కనడం..
వారికి ఏదంటె అది కొనివ్వడం ప్రేమతో పెంచుతున్నారు నిజమే కానీ ఆ గారాబం వాళ్లను మెుండిగా తయారు చేస్తుంది..
చిన్నమాటన్నా తప్పుగానె భావిస్తున్నారు..
ఇంట్లో పెద్దవాళ్లు లేక పోవడం అసలు ఉమ్మడి కుటుంబాలనేవే లేక పోవడం వలన పిల్లలకు ఎవరితో ఎలా ఉండాలో ఎలా నడుచుకోవాలో కూడా తెలియడం లేదు..
ఇక ఈ కాలేజ్ ల పరిస్థితయైనా స్కూళ్ల పరిస్థితైనా నేటి కాలంలో మాకే ర్యాంకులు రావాలి మార్కులు రావాలి అనే తీరులో ఉండి చదవండి చదవండని పిల్లలను తెగ బాధ పెట్టేస్తున్నారు.
అటు పేరెంట్స్ బాధ లక్షలు లక్షలు పెడుతున్నాం చదవమని ఇటు లెక్చరర్లు టీచర్ల బాధ అసలే సున్నిత మనస్తతత్వం అలవడి ఉన్న పిల్లలకు కష్టమై పోతూ ఈ ఆత్మహత్య అనే నిర్ణయాలు తీసుకుంటున్నారు..
ఇందులో అందరి తప్పు ఉన్నా! ముక్కు పచ్చలారని పిల్లలు బలై పోతున్నారు.ఒక్క చదువే ఉందా? ఎన్నో మార్గాలున్నాయి బ్రతకడానికి..
అది పేరెంట్స్ అయినా టీచర్లయినా అర్థం చేసుకుని ఏ పిల్లలు ఏ రంగంలో బాగున్నారో గుర్తించి వాళ్లను ప్రోత్సహించి వారి భవిష్యత్తతు బాగుండేలా కృషి చేయాలి..
అప్పుడే పిల్లలకు ఆ ఆలోచనలు రాకుండా ఉంటాయి..పిల్లలు కూడా ఒక వయసు రాగానె ప్రేమ దోమ అని ఆ మాయలో పడకుండా బుద్దిగా చదువుకోవాలి..
అన్నిటికీ మించి పిల్లలకు మనో ధైర్యం ఎక్కువ నేర్పించాలి పెద్ద వాళ్లు..
నేటి బాలలే రేపటి ఫౌరులు..వారి బంగారు భవిష్యత్తు బాగుండాలి..
-ఉమాదేవి ఎర్రం