బందీఖాన
బతుకు బందీఖాన కావద్దు
అంటారు పెద్దలు
ఇష్టంతో బతకాలి
కష్టపడి పనిచేయాలి అంటారు
కాలం మనకోసం ఆగదు
మన అన్వేషణ కాలాన్ని
సద్వినియోగం చేయడమే
పరుగెత్తే కాలంలో
బందీవై బతక కుండా
భావాలను బందీ ఖానాల్లో వేస్తే
స్వేచ్ఛా వాయువులు మసక
బడతాయి
ప్రపంచం ముందుకు సాగితే
మన ప్రయాణం ఆపకూడదు
పొటీ ప్రపంచంలో ఎదగడం
నేర్చుకోవాలి ఎలాగైనా
ఆలోచనలు మెట్టు మెట్టుగా ఎక్కిబలవంతపు బందీ ఖానాల
తలుపులు తెరవాలి
అన్ని రంగాలలో అభివృద్ధిని
చవిచూసే తరుణంలో
మనుషులు మారిన యంత్రాలు గా కాకుండా సృష్టించు కోవాలి
మనకు మనకుగా బలమైన
అవకాశాల వేదికలు మరి ….?
– జి జయ