బంధం
బంధం ఆప్యాయతల హరివిల్లు బంధం…
మమతలకు నిలయం బంధం…
ఏ బంధానికి అయినా ఆధారం నమ్మకం…
ఉమ్మడి కుటుంబాలకి మొదటిమెట్టు బంధం…
ఉమ్మడికుటుంబాలకు వ్యష్టి కుటుంబాలకు నెలవు బంధం…
ఆ నమ్మకం ఎంత బలంగా ఉంటే బంధం అంత దృఢంగా ఉంటుంది…
ఏ బంధాన్ని అయినా అస్థిర పరచేది ఓ చిన్న అపనమ్మకం…
ఏ బంధం అయినా బలంగా పరిపుష్టిగా ఉండాలంటే
అపనమ్మకాలకీ అపార్థాలకీ తావుండకూడదు…
ఉమ్మడి కుటుంబాల్లో పెరిగిన వారికి
ఎక్కువగా బంధాల విలువ తెలుస్తుంది…
ఏ బంధాన్ని అయిన నిలబెట్టుకునేలా ప్రవర్తన నిర్దేశిస్తుంది…
ఆ ప్రవర్తన సరైన క్రమంలో ఉంటే బంధం కూడా బలంగా ఉంటుంది…
– గోగుల నారాయణ