బంధాలే బలం

 బంధాలే బలం

“ఒక అమ్మాయిని ప్రేమించి డబ్బు కోసం మరో అమ్మాయి చేసుకోవడానికి సిద్ధపడ్డావు. నీకు సిగ్గు లేదా? తాళి బొట్టు తీసుకొని రండి” అని పెద్దగా అరుపుతో చెప్పాడు భూపతి. రంగన్న తాళి బొట్టు తీసుకొని వచ్చి “అయ్యా! గారు ఇదిగోండి తాళి అని చెప్పి చేతితో పట్టుకున్న తాళిని చూపిస్తూ , తాళిని అతనికి ఇవ్వు” అని కోపంతో చెప్పాడు భూపతి. రంగన్న తాళి తీసుకెళ్లి తరుణ్ చేతికి ఇచ్చాడు.
“మామయ్య నేను చేసింది తప్పే నన్ను క్షమించండి ఇంకెప్పుడు ఇలాంటి తప్పులు చేయను అని చెప్పి” తరుణ్ ఆ అమ్మాయి మేడలో తాళి కట్టాడు.
“పిల్లాపాపలతో చల్లగా ఉండండి” అని ఆశీర్వదించాడు భూపతి.
పంచాయతీ అయిపోయింది కాబట్టి అందరూ వెళ్లిపోయారు. ఊర్లో మంచి పేరు గల కుటుంబం భూపతి కుటుంబం వాళ్ళది పెద్ద కుటుంబం కూడా.
భూపతి ఇంటికి వెళ్తుండగా దారిలో ఒక అమ్మాయిని చూసి మొహం తిప్పుకొని వెళ్ళిపోయాడు.
‘తరుణ్ పగతో రగిలిపోతున్నారు ఎంత చెప్పినా నా మాట వినకుండా ఈ పనిమనిషికి ఇచ్చి నాకు పెళ్లి చేశారు ఎలాగైనా పగ తీర్చుకుంటాయి భూపతి మీద అని తన మనసులో అనుకుంటున్నాడు.’

“తనకంటూ ఒక విలువ లేకుండా తాగుబోతు మొగుడ్నించి కట్టబెట్టారని తను కొడుకుకి పనిమనిషికని ఇచ్చి పెళ్లి చేశాడని కోపంతో రగిలిపోతుంది షర్మిల. ఒకే ఇంట్లో కలిసి ఉన్న బయటికి మాత్రం కపట ప్రేమ నటిస్తూ లోపల మాత్రం పగ పెంచుకొని బతుకుతున్నారు. సరేనా అవకాశం గురించి ఎదురు చూస్తున్నారు. గతంలో తరుణ్ కి భూపతి కూతురిని ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నారు కానీ భూపతి కూతురు పల్లవి వేరే అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకోవడం వల్ల ఆ పెళ్లి జరగలేదు. తన స్నేహితుడైన రాఘవ కూతురిని తరుణ్ కి ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నారు అదే టైంలో పనిమనిషిని మోసం చేశారని ఆరోపణతో పంచాయతీలో దోషిగా నిలబడ్డాడు తరుణ్.
భూపతికి ఇద్దరు చెల్లెలు ఒక చెల్లి ఏమో తన కూతురు ప్రేమని గౌరవించి పెళ్లి చేసినందుకు కోపంగా ఇంట్లో నుంచి పంపించేసాడు.
భూపతికి చిన్నప్పుడు నుంచి తన పెద్ద చెల్లెలు అంటే చాలా ఇష్టం నామీద కంటే తనమీద ఎక్కువ ప్రేమ చూపిస్తున్నాడని అసూయపడేది. చిన్నప్పటి నుంచి ప్రతి విషయంలో తనకే ఇంపార్టెన్స్ ఇస్తున్నాడని పగ పెంచుకుంది షర్మిల.
భూపతి అందరిని సమానంగా చూసాడు. కానీ అందరి మాటలు సులువుగా నమ్మేసాడు. శారద మీద చెప్పిన చెప్పుడు మాటలు భూపతి వాళ్ళు ఇల్లు వదిలి వెళ్లిపోయోలా చేసింది షర్మిల.

ఒక రోజు భూపతి పని మీద ఒంటరిగా పక్క ఊరు వెళ్ళాడు. ఇదే మంచి అవకాశం అని అనుకొని తరుణ్ రౌడీలతో దాడి చేసేలా ప్లాన్ చేశాడు. భూపతి వెళ్ళిన దగ్గర అక్కడ శారద, పల్లవి ,వంశీలు ఉన్నారు. వాళ్ళని చూసిన భూపతి మొహం తిప్పుకొని పక్కకు వెళ్లిపోయాడు.
వచ్చిన పని అయిపోయిందని బయలుదేరబోతుండగా వంశీ ఫోన్ మాట్లాడుకుని బయటికి వెళ్లిపోయాడు అది గమనించిన భూపతి వెనక్కి తగ్గి కాసేపు అయ్యాక వెళ్లిపోయాడు.
అక్కడ ఉన్న తన ఫ్రెండ్స్ తో మాట్లాడుతుండగా భూపతి కార్ రావడం గమనించాడు వంశీ.
కొద్ది దూరం వెళ్ళగానే కార్ కి రౌడీలు అడ్డగించి చంపబోయారు. ఇది చూసిన వంశీ వాళ్ళ ఫ్రెండ్స్ భూపతిని కాపాడి వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారు.
రవి ఆ రౌడీలో ఒక రౌడీని తీసుకొని వంశి వాళ్ళ ఇంటికి వచ్చాడు. భూపతి ముందే వాడిని నాలుగు కొట్టి నిన్ను ఎవరు పంపించారు అని ఎంత అడిగినా చెప్పలేదు. లాస్ట్ కి వాడి ఫోన్ తీసుకొని కాల్ లిస్ట్ చూస్తే ఆ నెంబర్ కి కాల్ చేసి “భూపతిని చంపేశాము శవాన్ని చెరువులో పడేసాము అని చెప్పమని చెప్పాడు వంశీ.”
అలాగే రౌడీ కూడా వంశీకి భయపడి ఫోన్లో అదే చెప్పాడు.
“ఆ మాటలు విని మీకు ఈవినింగ్ పార్టీ ఇస్తున్నాను గెస్ట్ హౌస్ కి వచ్చేయండి” అని చెప్పాడు తరుణ్
“రావడం కుదరదు సార్ మేము వేరే ఊరు వెళ్లిపోయాము” అని ఆ రౌడీ చెప్పాడు.
వంశీ మెల్లగా రౌడీతో “పేరు ఏంటి కనుక్కో?” అది బెదిరిస్తూ చెప్పాడు
“మీరు ఇచ్చిన పని కంప్లీట్ చేశాము కదా. మీ పేరు ఏంటి సార్?” అని అడిగాడు రౌడీ.
తరుణ్ ఒక కాసేపు ఆలోచించి “నేను షర్మిల కొడుకుని” అని చెప్పి పెట్టేసాడు.
అది విన్న భూపతి చేయి గుండె మీద పెట్టుకొని స్పృహ కోల్పోయాడు.
ఇంత చేసిన తరుణ్ ఈ విషయం షర్మిలకు చెప్పకుండా చేశాడు.

కొన్ని రోజుల తర్వాత భూపతి వంశి వాళ్ళని తీసుకొని ఇంటికి రావడం చూసి షాక్ తో కుప్పకూలిపోయింది. ఇంట్లో వాళ్ళందరూ భూపతిని చూసి ఆనందించిన తరుణ్ షర్మిలకు మాత్రం చెమటలు పట్టేస్తున్నాయి.
వెంటనే షర్మిలను వెంటనే తన అత్తారింటికి పంపించేసి నువ్వు చేసిన కుట్రలో తెలిసిపోయి మనిషికి బంధాల బలం ఉంటే ఏదైనా సాధించగలడు అని చెప్పి పంపించేసాడు.
షర్మిల వాళ్ళ వెళ్ళిపోతుండగా పల్లవి ఆపడానికి ప్రయత్నిస్తూ కళ్ళు తిరిగి పడిపోయింది.
వెంటనే డాక్టర్ని పిలిపిస్తే పల్లవిని చెక్ చేసి ప్రెగ్నెంట్ అని చెప్పారు.
భూపతి మీద దాడి చేయించింది తరుణ్ అని తెలిసి వాడి చెంప పగలగొట్టి పద అడుక్కొని తిందాం అని చెప్పింది షర్మిల.

ఆ ఇల్లు ఆనందమయం అయింది.

-మాధవి కాళ్ళ 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *