బాల్యం ఓ ఆట
నాన్న నన్నంటుకో అని పదేళ్ల కూతురు పద్మ పరుగెడుతోంది.
అమ్మా,నేను పెద్దవాడినైపోయాను కదా, నాకాళ్ళలో పటుత్వం లేదమ్మా.నువ్వేమో కనిపించే మేఘాల వరకు పరుగెత్తమంటావ్.
నేను కూడా నీ అంత ఉన్నప్పుడు ,మా పల్లెల్లో ఎన్ని రకాల ఆటలు ఆడే వాడినో తెలుసా? పల్లెల్లో నా నేస్తాలతో రోజూ చాలాసాయంత్రాలు ఆటలలో గడిపేవాడిని
మీలా ఇప్పుడున్నచరవాణిలు అప్పుడు లేవు. రేడియో కూడా పెద్దవాళ్లు పెడితేనే మేము వినాలి.మేము చాలా కట్టుబాట్లలో పెరిగాము.
నీకు నేనిచ్చినంత స్వేచ్ఛఅప్పుడు మాకుండేది కాదు.అంత క్రమ శిక్షణ గాపెరిగాము కాబట్టే,ఉన్న కొద్దిపాటి ఆస్తులతో మాతల్లిదండ్రులు ఇంత మంచి ఉద్యోగం వచ్చే వరకు చదివించ గలిగారు.
ఇప్పటి తరం స్వేచ్ఛ కుఅలవాటు పడి,చరవాణిలకు అలవాటు పడి బాల్యజీవితాన్ని పాడు చేసుకుంటున్నారమ్మా.
అయ్యో,నాన్న నేను సరదాగా నాతో పరిగెత్తమన్నందుకు ఇంత క్లాస్ పీకావు. నేను నీతో మాట్లాడను ఫో అంటూమూతి ముడుచుకుంది పద్మ.
-రుద్రపాక సామ్రాజ్యలక్ష్మి