బడి విద్య
విద్య వినయేన శోభతే. విద్య ఎన్నో ఇస్తుంది, నేర్పిస్తుంది. విద్య వలన ఏమి రావాలి? విచక్షణా జ్ఞానం, వివేకం, నిత్యానిత్య విచారణ ఇత్యాదులు. సరైన విద్యార్ధికి వీటితో పాటు రావలసిన గుణం వినయం. వినయం లేని విద్య రాణించదు. ఎవడైతే తనకు అన్నీ తెలిసాయి అని అనుకుంటున్నాడో వాడికి ఏమీ తెలియవు అన్నది సుస్పష్టం. తనకు ఏదీ రాదు అని తెలుసుకున్నాడో వాడు సరైన విద్యార్ధి.
విద్య అనంతం. మనకున్న విజ్ఞానాన్ని తెలుసుకోవాలంటే కొన్ని జన్మలైనా సరిపోవు. ఇక్కడ ఎటువంటి విద్య గురించి చెబుతున్నారు. ఏ విద్య తెలుసుకుంటే అన్నీ అవగతం అవుతాయో అటువంటి ఆత్మవిద్య. మనకి చాలా నేర్పిస్తుంది
– భరద్వాజ్