బాబోయ్ ఇదేమి ప్రేమ
ప్రేమ త్యాగం కోరుకుంటుంది.కొందరి ప్రేమ భయం గొలుపుతుంది. అసలేమిజరిగిందంటే కావ్య కాలేజీలోచదువుతోంది. బాగా చదివిమంచి మార్కులు తెచ్చుకుని కాలేజీకి,తల్లిదండ్రులకు మంచిపేరు తెచ్చింది. కావ్యమంచి అందగత్తె. అమెచదివే కాలేజీలో ఉండే మదన్ ఆమెను చూసి ఆకర్షితుడయ్యాడు. ఆమె అందం అతన్ని ఆకర్షించింది.
కావ్య సహజంగా అందరితో చక్కగా మాట్లాడుతుంది.అలాగే మదన్ తో మాట్లేడేది.
ఒకరోజు మదన్ తన మనసులో ఉన్న ప్రేమనుకావ్యకు చెప్పాడు. కావ్యఅంగీకరించలేదు. తానుచదువు మీద శ్రద్ధపెట్టాలిఅనుకుంటున్నానని చెప్పింది.మదన్ బలవంత పెట్టసాగాడు.అయినా కావ్య అంగీకరించలేదు. ఈలోపుకావ్య చదువు పూర్తి అయ్యింది. ఆమె పేరెంట్స్ఆమెకు పెళ్ళి సంబంధంచూసారు. పెళ్ళి చూపులు
కూడా అయ్యాయి. ఆమెకుపెళ్ళి నిశ్చయం అయ్యింది.అది మదన్ కు కోపం తెప్పించింది.
తనకు దక్కనికావ్య ఎవరికీ దక్కడానికివీల్లేదని ఆమె ఒంటరిగాఉన్నప్పుడు ఆమె మొహంపైయాసిడ్ పోసాడు. మదన్రాక్షస ప్రేమకు కావ్య బలయ్యింది. ఆమె జీవితంనాశనమైంది. పోలీసులుమదన్ ను అరెస్ట్ చేసినాఆమెకు జరగరాని అన్యాయంజరిగిపోయింది. పోలీసుకేసు నుండి తప్పించుకోవడానికి మదన్ కావ్యను పెళ్ళిచేసుకుంటాను అని మధ్యవర్తుల ద్వారా ఆమెతల్లిదండ్రులకు సందేశం పంపాడు.
కావ్య అసలేఒప్పుకోలేదు. ఆ తర్వాతఆమె గొప్ప చదువులు చదివిగొప్ప ఉద్యోగం సాధించింది.తన మనసుకు నచ్చిన జగన్ ను పెళ్ళిచేసుకుంది.
-వెంకట భానుప్రసాద్ చలసాని