బాటసారి
దప్పిక తీరని ఎడారిలా
ఆకలి తీరని పులిలా
బ్రమణం చేసే భూమిలా
ఉవ్వెత్తున ఎగసే కెరటంలా
భాద్యతలు మోసే నాన్నలా
ప్రేమను పంచే అమ్మలా
సాగిపో బాటసారి
గుడిసెను కమ్మిన అమావాస్యను
రైతులను పీడ్చే దళారులను
అఘాయిత్యాలకు పాల్పడే
హంతకులను
ఓట్లను దొంగిలించే నాయకులను
ప్రశ్నించడానికి సాగిపో బాటసారి
అంతంలేని ప్రశ్నలకు
అర్థంలేని ఆవేశాలకు
ఆకలైన అన్నార్తులకు
అనంతమైన దైవాన్ని
ప్రశ్నించడానికి సాగిపో బాటసారి
– హనుమంత