బానిసత్వం
బానిసత్వం అంటే స్వేచ్ఛా స్వాధీనంలో పనిచేయడం
అన్ని తెలిసినామాట్లాడలేని
స్వతంత్ర లేని స్థానం అది
అన్నింటికంటే మనిషికి బరువైన పదం బానిసత్వం
సంకెళ్లు వేసిన శ్రమకు తగ్గ ఫలితం రాని వారు వేల సంవత్సరాలుగాగాప్రపంచంలో జరుగుతున్న నిత్యసత్యం
హక్కులు అని పోరాటాలు చేసినా పేర్లు మార్పు కాని
ప్రయోజనం తక్కువే అని చెప్పాలి “వెలుగునిచ్చే “దీపానికి వత్తిలా కరుగూతూనే వున్నారు భయంతో పనిచేసినా ఆశించిన వేతనం లేదు అభివృద్ధి ముసుగులో డబ్బు అవసరాల నేపధ్యంలో ప్రశ్నే వేయక పనిచేసి నిరక్షరాస్యత అయినా ధనిక పేద తేడాలు మనిషి అవసరాల
అవస్థలకోసం జైలుజీవితం లా సాగిపోతోంది బానిస బతుకుల జీవనం ఆధిపత్య
కోరల్లో అలమటించే
ఆశక్తులు ఆశక్తులే కదా
వాదాలు ఏవైనా వాస్తవాలు
ఎరుగక దీరత్వమే వున్నా రక్తమేమరిగినా ఆత్మగౌరవాన్ని అడ్డుపెట్టినా
బానిసత్వం నుండి బయటపడే మార్గం కోసం
ఎదురుచూస్తూ సామాన్యుని చైతన్యం
బాధను మరచి పోవడానికి
మద్యానికి బానిసలు గా
మారితే యువతరం గతి
ఎక్కడ దేశాల భవిత ఎక్కడ
బానిసత్వం గుర్తులెక్కడ…..?
– జి జయ