భాద్యత
బాధ్యత అనగానే వెంటనే వచ్చేవి..
మన మదిని పలు విధముల తొలిచేవి…
ఏమిటి బాధ్యత….???
ఎవరికి బాధ్యత….???
ఎందుకు బాధ్యత….???
ఎలా ఈ బాధ్యత….???
అవసరమా బాధ్యత….???
ఎక్కడ దొరుకుతుంది ఇది
ఎంతకు దొరుకుతుంది ఇది
అందుకని… సహృదయంతో ఇలా …
ఓ అమ్మని అడుగుదామా…
ఓ నాన్నని అడుగుదామా…
ఓ గురువు ని అడుగుదామా…
ఓ నాయకుడిని అడుగుదామా…
ఓ సంఘసంస్కర్త ని అడుగుదామా…
ఓ దేశ పౌరుడి ని అడుగుదామా…
చివరిగా ఓ సిపాయి ని అడుగుదామా…
అన్నింటికీ మించి ఓసారి మనల్ని మనం అడుగుదామా..
ఎందుకంటే..
బాధ్యత అనేది అందరి బాధ్యత…
ఏ ఒక్కరు తమ బాధ్యత లను విస్మరించినను
అంతా భస్మమగును..
ఆపై జీవితం సమాప్తమగును…
– కిరీటి పుత్ర రామకూరి