అవని
భూమి,
నేల,
వసుమతి,
పుడమి,
ధరణి
ఏవైనా నీకు పేర్లు అనేకం ఉండుగాక….
నీవు పకృతి సృష్టివై ముక్క గా విడి ,చల్లార్చబడి, అనంతకోటి జీవరాసులకు నిలయమై ఖండాలుగా విభజితమై ఉన్నావని…..
నీవు మేము విశ్వసించే మత గ్రంధాలప్రకారం దైవం చే విశ్వంలో సృష్టించడి ఖండాలుగా విభజితమై జీవకోటి సంరక్షణిగా ఉన్నావని….
మనుషులు గా మేము నీ పై భిన్న అభిప్రాయాలు కలిగి నివశిస్తున్నది వాస్తవమని ఎరిగి,నీవు ఈ విశ్వంలో ఒక గ్రహమని వేల ఏళ్ల క్రితమే తెలుసుకుని , మాతోపాటు అనంతమైన జీవరాసులు కు నీవే ఆధారమని గ్రహించి జీవనం కొనసాగిస్తున్న తెలివైన జీవులం….
నీపై గలప్రకృతి ఒక జీవనగతి అందు విద్య, వైద్యం మేమందుకొని మనోవికాసులమై ,ఆరోగ్య వంతులమై, అందు అందచందాల అనుభూతి పొందుచూ, అందు అన్నిటి పై ఆదిపత్యం సాధించి,శోధించి ,ప్రకృతి సంపద కొల్లగొట్ట నారంభించి,దుష్ట ఆలోచనా పరులమై నీవందించి ప్రకృతి నాశనం చేయ, మేమే మావినాశనం కోరి తెచ్చుకుంటున్నాము….
నీవు మా జీవనానికి కావలసిన ఆహారం , గాలీ ,నీరు అందిస్తూ ,నీగర్భమందు గల ఖనిజ సంపద ను మా అభివృద్ధి కి ఇస్తూ…. మమ్ములను నీ బిడ్డలవలే సాకుతుంటే…..
మేము నాగరికులమై,దురాశా పరులపై ,దుష్ట ఆలోచన లతో , మా సంతోషాలకు ,సుఖాలకు , నిన్ను కలుషితం చేసి బలి చేస్తున్న మూర్ఖులం…..
శతాబ్దాల క్రితం”సీతల్” అనే ఆదివాసీ అమెరికా ప్రభువులక చెప్పిన ప్రకారం నీవు పవిత్రమైన దానవు , నీ పై ఉమ్మడం అంటే మాపై మేము ఉమ్ముకోవడమే నని ,నిన్ను కలుషితమనే అపవిత్రం చేయకుండా ఉండవలసిన బాధ్యత మాదని, అది విష్మరించి మా సుఖ-సంతోషల కొరకు నీ పై పకృతి ని నీ గర్భమందు సంపదను నాశనం చేస్తున్నాం…. కారణంగా అనేక జీవరాసులు అంతమై పోతున్నాయని నీవు బాధ తో కుమిలిపోతున్నావు…. అలా కొనసాగితే నీవందించి న ప్రకృతిలో జరగవలసిన మార్పులు జరగక నీకు అతి ఇష్టమైన మానవ జీవి అంతరించి పోతారని హడలిపోతున్నావు….
ఓ “అవని” నీవు ప్రకృతి సృష్టివైతే ప్రకృతిని….
దేవుని సృష్టివైతే ఆ దైవాన్ని కోరు….
ఈ నాగరీక మానవులకు మంచి బుద్ధి ప్రసాదించమని. నీవు బాగుంటేనే సమస్త జీవకోటి మనుగడ ఉంటుందని గుర్తెరిగి జీవించమని…..
– విశ్వనాథ్. నల్లి