ఆత్మహత్యలు ఆపాలి

ఆత్మహత్యలు ఆపాలి

చిన్న వయసులోనే పిల్లలకు
మానసిక వత్తిడి పెరుగుతోంది.

తల్లిదండ్రులు, గురువులు ఈ

చిన్నపిల్లలకు చిన్న వయసులో లక్ష్యాలు ఏర్పరుస్తున్నారు. ఆ
లక్ష్యాలు అందుకోలేక మానసిక
వత్తిడికి గురవుతున్నారు చిన్న
పిల్లలు. వారికి ఆడుకోవడానికి
సమయం ఉండటంలేదు. ఎంత
సేపూ చదువు-చదువు అని వారి పెద్దలు వెంటపడుతుంటే
వారికి చదువంటే భయం కలిగి
ఆందోళన పడుతున్నారు. మార్కులే పరమావధిగా పిల్లల
జీవితం గడుస్తోంది. సరైన
వ్యాయామం లేకపోవడంతో
ఆరోగ్య సమస్యలు కూడా
మొదలవుతున్నాయి. ఒకటో
తరగతి నుంచి ఐ.ఐ.టి శిక్షణ
అవసరమా అంటే తల్లిదండ్రుల
వద్ద జవాబు లేదు. పిల్లలు తమ తెలివితేటలకు తగ్గట్టే
చదవగలరు. అందరూ మంచి
మార్కులు సాధించలేరు. అది
అందరికీ తెలిసినా తక్కువ
మార్కులు వచ్చాయని ఆ
చంటి పిల్లలను దండించటం
జరుగుతోంది. అది తట్టుకోలేక
పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటారు. చాలా
మంది పిల్లలు భయంతో ఈ
అఘాయిత్యానికి పాల్పడుతూ
ఉంటారు. అది తల్లిదండ్రులకు
శరాఘాతం అవుతోంది. చేతులు కాలాక ఆకులు
పట్టుకుని లాభం ఉండదు.
పిల్లలను వారి అభిరుచికి
తగ్గ చదువు చదివించాలి.
ఇష్టపడి చదివే పిల్లలు తమ
లక్ష్యాన్ని సాధించగలరు.
కొందరు పిల్లలు ఆటలలో,
ఇంకొందరు నాట్యంలో, మరి
కొందరు చిత్రలేఖనంలో తమ
ప్రతిభను చూపుతారు. వారి
వారి అభిరుచులను బట్టే వారకి శిక్షణ ఇప్పించాలి.
అప్పుడు పిల్లల ఆత్మహత్యలు అనేవి దాదాపుగా ఉండవు.
పిల్లల బాల్యాన్ని స్వర్గతుల్యంగా మార్చాలి.
అప్పుడే మన దేశ భవిత
బాగుంటుంది. ఎందుకంటే
నేటి బాలలే రేపటి పౌరులు.
ధైర్యంగా ఈండే పిల్లలే దేశానికి
అవసరం.

 

-వెంకట భానుప్రసాద్ చలసాని

0 Replies to “ఆత్మహత్యలు ఆపాలి”

  1. పిల్లలపై మానసిక వత్తిడి తగ్గితే ఆత్మహత్యలు అనేవే ఉండవు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *