ఆత్మఘోష
ఆమె నేడు కానరాదే.
పోయి చాలా రోజులాయే.
ఆత్మ ఏమో తిరిగి వచ్చే,
కాయమేమో కాలిపోయే.
కోరికేమైనా మిగిలినేమో.
పిండమేమో చేసి పెడితే,
కాకి ఏమో రాకపోయే.
కోరికేమైనా మిగిలెనేమో.
బంధువులంతా ఏడ్వసాగే.
చచ్చిపోతే ఎలాగమ్మడు
అని అమ్మ,నాన్న ఏడ్వసాగే.
ఆ కన్నె ఆత్మ ఏడ్వసాగే.
ధైర్యం చెప్పే వారు ఉంటే,
చచ్చిపోయే అవసరం లేదే
అని కన్నె ఆత్మ ఏడ్వసాగే.
ఆత్మహత్య పాపమని
చెప్పేవారూ లేకపోయే.
కష్టాలన్నీ కాటువేసే,
కాలమేమో చెల్లిపోయే.
ఆత్మ ఏమో ఏడ్వసాగే.
కాయ మేమో తిరిగి రాదే.
చచ్చిపోతే ఫలితమేమీ,
బతికితేనే మంచిదేమో
అని ఆత్మ కూడా ఏడ్వసాగే.
ఆత్మహత్య పాపమని
నాకు చెప్పేవారే లేకపోయే
అని ఆత్మ ఏమో ఏడ్వసాగే.
(ఆత్మహత్య చేసుకుంటే
ఆమె నరకానికి పోతుందనేది
నిజమో కాదో కానీ బంధుమిత్రులు మాత్రం
భూమ్మీదే నరకం చూస్తారు)
-వెంకట భానుప్రసాద్ చలసాని.