ఆత్మవిశ్వాసం

ఆత్మవిశ్వాసం

“శిరీష ఎప్పుడు హాస్టల్ కి వెళ్తున్నావు సదుపాయాలన్నీ మంచిగున్నాయా టైంకి తింటున్నావా? ఫ్రెండ్స్ వాళ్ళు ఎలా ఉన్నారు? కాలేజ్ ఫ్రెండ్స్ వాళ్ళు ఎలా ఉన్నారు అమ్మ” అని అడిగింది జయ.
“ఎన్ని రోజులు హాలిడేస్ రా” అని అడిగాడు ప్రసాద్.
“వారం రోజులు తర్వాత వెళ్తాను అమ్మ అన్ని సౌకర్యాలు బానే ఉన్నాయి. అందరూ ఫ్రెండ్స్ అయిపోయారు నాకు” అని చెప్పింది శిరీష.

“సరే సిరి నువ్వు వెళ్లి ఫ్రెష్ అయ్యి రా. మనం భోజనం చేద్దాం” అని చెప్పింది జయ.”సరే అమ్మ” అని చెప్పి తన రూమ్ లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి డైనింగ్ టేబుల్ మీద కూర్చుంది.”ఈరోజు ఏం స్పెషల్ వంటలు చేసావు” అని అడిగాడు ప్రసాద్.”సిరికి మీకు ఇష్టమైన వంటలు చేశాను” అని చెప్పింది జయ.

ఇలా వారం రోజులు తల్లిదండ్రులతో హ్యాపీగా గడిపేసి హాస్టల్ కి వెళ్ళిపోయింది శిరీష. బాసరలో ఐటి కాలేజీలో ఫస్ట్ ఇయర్ అవుతుంది. తల్లిదండ్రులకు దూరంగా ఉండడం ఇష్టం లేకపోయినా తను బాగా చదువుకొని వాళ్ళని బాగా చూసుకోవాలని దూరంగా ఉండి చదువుకుంటుంది.

హాస్టల్ కి వెళ్ళిన కొన్ని రోజులు తర్వాత కాలేజీలో ర్యాగింగ్స్ చేయడం స్టార్ట్ చేశారు. ర్యాగింగ్ చేసిన కూడా కంప్లైంట్ చేస్తే మాత్రం చంపేస్తామని బెదిరించేవారు.

శిరీషకి ప్రతిరోజు డైరీ రాసే అలవాటు ఉండేది దాంతోపాటు తన కాలేజీలో జరిగిన విషయాలు కూడా డైరీలో రాసింది. సీనియర్ తన ఫ్రెండ్ నీ లవ్ చేస్తున్నానని వెంటపడితే తను పట్టించుకోలేదు. దాంతో ఆ అమ్మాయి తినే అన్నం లో విషం కలిపాడు.

ఆ అమ్మాయి చనిపోవడం వల్ల ఎగ్జామ్ లో తక్కువ మార్కులు రావడం వల్ల చనిపోయింది అని క్రియేట్ చేశారు. శిరీష ఈ విషయం తెలుసుకున్న శిరీష చాలా బాధపడ్డది. బాధపడుతూ గతంలోకి వెళ్లిపోయింది శిరీష.

తను మొదటగా జాయిన్ అయిన తర్వాత ముందుగా ఫ్రెండ్ అయ్యింది కీర్తి. కీర్తి , శిరీష ఇద్దరు మంచి ఫ్రెండ్స్ గా ఉండేవారు. ఒకరోజు కాలేజీలో ర్యాగింగ్ జరుగుతున్నప్పుడు శిరీష , కీర్తి చూశారు.

అది చూసిన కీర్తి “ఎంత మన తల్లితండ్రుల ఆశాన్ని నిలబడటానికి చదువుకోడానికి ఇంత దూరం వచ్చిన ఇలాంటి వాళ్లు మనల్ని తొక్కేస్తున్నారు. మరి కొందరు ప్రేమ గీమ అంటూ తల్లిదండ్రులు నమ్మకాన్ని వమ్ము చేస్తున్నారు.

అన్ని విషయాల్లో మనకి పోటీ వస్తున్న కొందరు మాత్రం నేను డబ్బులు కట్టాను నువ్వు గెలవలేవు నీకు మార్క్స్ రావు అని ఏడిపిస్తూ చులకన భావంతో చూస్తూ ఉంటారు అని చెప్పింది.”

నువ్వు చెప్పింది కూడా ముమ్మాటికి నిజమే కీర్తి కానీ రాగింగ్ చేయొద్దు అని చెప్పిన కూడా వినకుండా ర్యాగింగ్ చేస్తూనే ఉన్నారు. కొందరు ర్యాగింగ్ గురించి చెప్పాలనుకున్న దైర్యం చేయలేకపోతున్నారు అని చెప్పింది శిరీష.
కీర్తి మాటలు తలుచుకొని ఏడుస్తూనే ఉంది శిరీష.

కీర్తి చచ్చిపోయేంత పిరికిది కాదు తను చదువులో కూడా ఫస్ట్ అలాంటిది చనిపోవడానికి కారణం ఏముందని దీర్ఘంగా ఆలోచిస్తుంది శిరీష.
కీర్తిని ప్రేమిస్తున్నానని సీనియర్ వెంట పడడం గుర్తొచ్చింది.

కీర్తి చనిపోవడానికి ఇతను కారణం కావచ్చేమో అని కళ్ళు తుడుచుకొని ఒక ప్లాన్ ఆలోచించింది.

నెక్స్ట్ రోజు మార్నింగ్ కాలేజీకి వెళ్ళింది శిరీష. తను క్లాస్ రూమ్ కి వెళుతుండగా అక్కడ తన సీనియర్స్ మాట్లాడుకుంటున్నారు ఇద్దరు.
“ఏరా రాజేంద్ర కీర్తి నీ ప్రేమను కాదన్నదని నువ్వు చంపేసావా?” అని అడిగాడు రవి.

“తను తిని అన్నంలో విషం కలిపేసాను రా. అదే సూసైడ్ గా క్రియేట్ చేశాను” అని చెప్పాడు నవ్వుతూ రాజేంద్ర.
ఇది విన్న శిరీష వెంటనే వీడియో తీసింది.

కీర్తిని సూసైడ్ కాదు రాజేంద్ర చంపేశాడు అన్నదానికి సాక్షాలు కోసం వెతుకుతుంది. తన అదృష్టవశాస్తూ వాడి నోట నుండి నిజం చెప్తుండగా తను వినడం వీడియో తీయడం చాలా మంచి జరిగింది అనుకుంది శిరీష.
చదువులో అందరూ పోటీ పడుతుంటారు అలాగే శిరీష , గీత పోటీ పడ్డారు. ఈసారి ఎగ్జామ్ లో ఎవరు ఫస్ట్ వస్తే వాళ్ళకి క్యాంపస్ ఇంటర్వ్యూ లో ఉద్యోగం వస్తుంది అని చెప్పారు లెక్చరర్స్.
ఎంతో సిన్సియర్గా శిరీష బాగా చదివింది ఎగ్జామ్స్ కూడా బాగా రాసింది. శిరీష చేస్తున్న ప్రతి పనిని గమనిస్తూ తనతో పోటీ పడడం చాలా కష్టమని ఎగ్జామ్లో చీటీలు పెట్టి రాసింది గీత.
మార్కులు కూడా బాగానే వచ్చాయి గీత కంటే శిరిషకే ఎక్కువ వచ్చాయి.గీత అది చూసి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది.
అది గమనించిన శిరీష వెంటనే వెళ్లి గీతని ఆపుద్ది.

గీతా నీకేమైనా పిచ్చా క్షణికావేశంలో ఆత్మహత్యచేసుకోవడానికి ప్రయత్నిస్తున్నావు.నువ్వు ప్రతి విషయాన్ని భూతద్దంలో చూసి నా మీద అసూయ పెంచుకొని నువ్వు ఒత్తిడికి లోనవుతూ ప్రతి చిన్న విషయానికి కోపం తెచ్చుకుంటే అది నీ ఆరోగ్యానికి మంచిది కాదు.

మనలో పోటీతత్వం ఉండాలి కానీ ఎదుటి వాళ్ళు నాశనమైపోవాలి నేనే ముందు ఉండాలి అని అనుకున్నంతగా ఉండకూడదు.
మనం ప్రతిరోజు పేపర్లలో టీవీలో చూస్తున్నాము ప్రతి చిన్న విషయానికి ఆత్మహత్య చేసుకుంటున్నారు. గేమ్ ఆడుతానంటే ఫోన్ ఇవ్వలేదని , ఫ్రెండ్స్ తో బయటికి వెళ్తాను అంటే డబ్బులు ఇవ్వలేదు అని వీటన్నిటికీ ఆత్మహత్య చేసుకోవడమో పరిష్కారం కాదు.

భవిష్యత్తు, జీవితాంతం కష్టసుఖాల్లో కలకాలం కలిసి ఉంటామని అగ్నిసాక్షిగా చేసుకున్న ప్రమాణం, ఆప్యాయత ఆవేశం వీడి గుర్తుతెచ్చుకోవాలి.తల్లిదండ్రులు, మిత్రులు ఆత్మీయులతో పంచుకోవాలి.

తనలో ఉన్న ఆత్మవిశ్వాసానికి గీత కూడా ఫిదా అయిపోయి మళ్ళీ చదివి ఎగ్జామ్స్ బాగా రాసింది.
ప్రతి రంగంలో పోటీ తత్వం ఉంటుంది కానీ కొందరు చులకన చేసి మనలో ఉన్న ఆత్మవిశ్వాసాన్ని దెబ్బ కొడతారు.
దానివల్ల మనము ఎక్కువగా ఒత్తిడికి లోనయ్యి ఆత్మహత్య చేసుకుంటాము.

ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలి నువ్వు ఏం తప్పు చేసావ్ అని ఒక్కసారి నిన్ను నువ్వు ప్రశ్నించుకుంటే నువ్వెప్పుడూ ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించవు అని చెప్పింది శిరీష.

ఆత్మవిశ్వాసం ఉంటే ఏదైనా సాధించవచ్చు కానీ మనం ఏ విషయాన్ని ఒత్తిడికి లోనయ్యేటట్టు తీసుకోకూడదు అని చెప్పింది శిరీష.
కీర్తిని చంపింది రాజేంద్ర అని సాక్షార దారాలతో నిరూపించి పోలీసులకు పట్టించింది శిరీష.

కీర్తి పేరెంట్స్ కూడా తన ఆత్మకు శాంతి కలగాలని కోరుకున్నారు.
ఇప్పుడు శిరీష క్యాంపస్ ఇంటర్వ్యూలో తనకి ఉద్యోగం వచ్చింది అని వాళ్ళ పేరెంట్స్ కి ఫోన్ చేసి చెప్పింది.
వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఎంతో ఆనందపడ్డారు.

 

-మాధవి కాళ్ల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *