ఆత్మఘోష
భోజనం చేసి తన ఇంటిలో పడుకున్న మారుతీరావు అలా నిద్రలోనే మరణించారు. స్మశానం లో దహన కార్యక్రమం పూర్తి అయ్యాక, ఆ తర్వాత పదకొండవ రోజు దినంఅయ్యేదాకా ఆయన ఆత్మ ఆ ఇంటి చుట్టూ తిరుగుతూనే ఉంటుంది అని పెద్దలు చెప్పినాకూడా మారుతీరావు వారసులు ఆస్తుల విషయంలో
తీవ్రంగా గొడవపడుతూ ఉన్నారు.
మారుతీరావు భార్య బంగారం పంచుకునే విషయంలో కూడా తీవ్రఘర్షణ పడుతున్నారుమారుతీరావు వారసులు.
మారుతీరావు భార్యచాలా అదృష్టవంతురాలు.పిల్లలు తన ముందుపోట్లాడుకునే దృశ్యంచూడకుండానే మూణ్ణెల్లక్రితమే మరణించింది ఆమె.ఇప్పుడు మారుతీరావుమరణించాడు.
ఆయనపార్ధివ దేహం అక్కడ ఉండగానే ఆయన వారసులుఆస్తుల కోసం పోట్లాడుకోవటంఎవరికీ నచ్చలేదు. ముఖ్యంగామారుతీరావు ఆత్మకు అసలునచ్చలేదు.
మారుతీరావు పెద్దకొడుకు ఇల్లు తనకే ఇవ్వాలనిఅంటాడు. చిన్న కొడుకు తనకేఇవ్వాలంటాడు. కూతురేమోఅమ్మ బంగారం అంతా తనకేకావలంటోంది.
దురదృష్టంఏమిటంటే మారుతీరావు ఏవీలునామా వ్రాయలేదు.మారుతీరావు ఆత్మ దేవుణ్ణిఎంతో ప్రార్ధిస్తోంది.
ఒకసారిబతికిస్తే కొడుకులకు, కూతురికిఆస్తులు పంచి వస్తానని దేవుడిని వేడుకున్నాడు.తన కుమారులు ఇలాఆస్తుల కోసం పోట్లాడుకుంటూఉంటే తన ఆత్మకు శాంతిఉండదని వేడుకున్నాడు.
చావు అనేది ఒన్ వే అని,తిరిగి రావటం కుదరదనిఅతనికీ తెలుసు. అయినాతన ప్రయత్నం తాను చేస్తోందిమారుతీరావు ఆత్మ.
తన వారసుల వద్దకు వెళ్ళిపోట్లాడుకోవద్దని బ్రతిమాలిందిఆ ఆత్మ. ఆ ఆత్మ ఘోషవారికి వినపడదు కదా.
దహన సంస్కారాలుఅయినాక ఉత్తమ లోకాలకువెళ్ళవలసిన మారుతీరావుఆత్మ వారసుల వల్ల కోరిక తీరక ఆ ఇంటి చుట్టూ ఇప్పటికీ ప్రేతంలా తిరుగుతోంది.
-వెంకట భానుప్రసాద్ చలసాని