అసూయాద్వేషాలు
ఉదయాన్నే ఉరుకుల పరుగుల జీవితంలో ఎప్పట్ల l అయిదింటికి లేచి,పనులన్నీ ముగించి, పిల్లలకు బాక్స్ కట్టేసి, ఎనిమిదిన్నర కు వారిని పంపించి ,నాకు ఆఫీస్ కు కాస్త సమయం ఉండడం తో ఫోన్ తీసుకుని అందరికీ విష్ చేసి ,ఆ రోజు పుట్టిన రోజులు జరుపుకునే వారికి శుభాకాంక్షలు తెలిపి , సమయం అవడం తో ఆఫీస్ కి వెళ్ళాను. ఆఫీస్ లో పని చేస్తూనే ఖాళీ దొరికినప్పడల్లా కథలు రాస్తూ, నా సమూహం లో ఆక్టివ్ గా ఉంటూ అందరితో కలివిడిగా కలిసి పోవడం నా అలవాటు.అలాగే సోషల్ మీడియాలో కూడా యాక్టిివ్ గా ఉంటాను.
ఎప్పటి విషయాలు అప్పుడు తెలుసుకుంటూ దానికి స్పందించడం నేర్చుకున్నా, ఏమి తెలియక పోతే సమాజం లో జరిగేది ఏది తెలియదు కాబట్టి అన్ని తెలుసుకుంటూ ముందుకు సాగాలి.నేనొక చిన్నపాటి రచయితను అవడం వల్ల నాకు సమాజం లో జరిగేవి తెలుసుకుని వాటిని కథలుగా రాస్తూ ఉంటాను. అందుకే సోషల్ మీడియాలో ఆక్టివ్ గా ఉంటూ అందరితో కలసి చర్చిస్తూ ఉండడం అలవాటుగా మారింది.
అయితే ఈ మధ్యనే నా చిన్ననాటి మిత్రులంతా కలిశారు.వారంతా సమూహాలు ఏర్పాటు చేశారు.అందులో నన్ను కూడా తీసుకున్నారు.కానీ ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వడం చాలా తక్కువే . కనీసం పొద్దున విషెస్ కూడా చెప్పరు. అలా ఎందుకంటే మేము బిజీ సమయం ఉండదు అంటారు. ఇరవై నాలుగు గంటలూ దగ్గరే చరవని పెట్టుకుని సమయం లేదనడం ఎంత హాస్యస్పదంగా అనిపించింది నాకు.సరే లెమ్మని ఊరుకున్నా నాకు కూడా పెట్టాలని అనిపించక పెట్టడం మానేశా . కానీ మనసులో ఎప్పటి కైనా క్లాస్ పికాలని అనుకున్నా.😄 .
అనుకున్నట్టే ఆ సమయం రానే వచ్చింది నిన్న రాత్రి ఆ సమూహం ఏర్పాటు చేసిన అడ్మిన్ ఏం చేస్తున్నారు.చలికి బయటకు రావడం లేదా అని , ఇక దొరికిందే ఛాన్స్ అనుకుని. అడ్మిన్ బద్దకంగా ఉంటే ఎవరోస్తారు అన్నాను.దానికి తను నాకు సమయం లేదు నీలాగా అంది. అలాగే ఇప్పుడు నాకు సమయం ఉంది ఇప్పుడు చాట్ చెయ్యి, నీ టైపింగ్ స్పీడ్ లేదంటూ ఏదేదో అనడం మొదలు పెట్టింది.
నాకొక్కసారిగా కోపం తెప్పించింది. ఇక నేను అందుకున్నా నేను ఖాళీగా ఉన్నాను అని నికేవరు చెప్పారు,నువ్వు చూశావా, నికిప్పుడు సమయం ఉందేమో కానీ నాకు లేదు నేను అయిదింటికి లేచి నా పనులన్నీ చేసుకుని ,ఉద్యోగానికి వెళ్లి వస్తాను.అలాగే అన్ని విషయాలలో ఆక్టివ్ గా ఉంటాను. నాకు కొన్ని సమూహాలు ఉన్నాయి.
దీనికి సమయం అవసరం లేదు. చేయాలి,తెలుసుకోవాలి అనే ఆసక్తి,కోరిక ఉండాలి. అలాగే అందరికీ నేను ఖాళీగా లేనని చెప్పుకుంటూ తిరిగే వారే ఖాళీగా ఉంటారు. అందరినీ తనవారు అనుకునే ఓపిక ,సహనం రెండూ ఉండాలి.సమూహం ఏర్పాటు చేయగానే సారీ6కాదు.
అందులో ఉన్నవారి గురించి తెలుసుకోవాలి.అడ్మిన్ అంటే ఎప్పటికప్పుడు కొత్త విషయాలను తెలుసుకుంటూ,అందరికన్నా ముందు పంచుతూ ఉండాలి. అలాగే నచ్చని విషయలు ఎవరన్నా చెప్పినా పోస్ట్ చేసినా వాటిని తొలగిస్తూ, వారిని అవసరం అయితే మందలిస్తూ ఉండాలి.
అడ్మిన్ లకి ప్రభుత్వం కొన్ని రూల్స్ కూడా పెట్టింది.అవి తెలుసుకోవాలి.సమూహం అడ్మిన్ అంటే అషామాషి కాదు. అని చెప్పాను.దానికి తను ఇంకేదో అనబోయిoది కానీ అప్పటికే సమయం పదకొండు కావడం తో నేనూ శుభరాత్రి చెప్పి ఫోన్ పక్కన పెట్టాను.
ఆ తర్వాత నిద్ర పోవాలని ప్రయత్నం చేస్తుంటే చటుక్కున గుర్తుకు వచ్చింది.తను అంతకు ముందు అన్న మాటలు.అప్పుడు అర్దం అయ్యింది ఓహో ఇదంతా దాని కోసమా అని , దాంతో నేను నవ్వుకున్నా , ఇంతకీ అసలు విషయం ఏమిటంటే, మేము చదువుకునే సమయం లో మా నాన్నగారు మాకు ఆంగ్ల బోధకుడు గా ఉండేవారు.
అప్పుడు ఏదో ఒక విషయం లో తప్పుగా రాసింది అని ఆ అమ్మాయిని కొట్టారు. అది మనసులో పెట్టుకుని సమూహం లో నేను చేరగానే తను అది గుర్తు చేస్తూ నాతో ఆంగ్లం లో మాట్లాడడం మొదలు పెట్టింది. నేను మాట్లాడాను ఇప్పుడు నా ఆంగ్లం బాగుందా అని తానెందుకు అడిగిందో, ఇప్పుడు నాతో ఇంతగా ఎందుకు చర్చించింది అర్థం అయ్యింది.
అలాగే నేను ఎప్పటికప్పుడు రాసే కథలను అక్కడ పంచుకోవడం చూసి, నా రాతలు బాగున్నాయని తానే మెచ్చుకుని నటించింది అంటే అప్పటి విషయాన్ని ఇప్పటి వరకు గుర్తు పెట్టుకుని మా నాన్నగారు తనను కొట్టారు అనే ఉద్దేశ్యంతో నన్నేదో చిన్నతనం ,చులకన చేయాలనే ఉద్దేశ్యంతో ఇలా మాట్లాడింది అని అర్థం చేసుకుని ,తన పిచ్చి ఆలోచనకు నవ్వు వచ్చింది.
మనిషికి అసూయా ద్వేషాలు ఉండడం వల్ల ఇదిగో ఇలా వారిలో వారే కుళ్లుతూ,కుమిలి పోతూ,ఎదుటి వారిని తక్కువ చేయాలని, తామేదో గొప్ప అని చూపించాలని అనుకోవడం వల్ల పెద్ద పోయేది ఏమి లేదు. వారి ఆరోగ్యం పాడవడం తప్ప.
కాబట్టి ఎప్పుడూ అసూయా ద్వేషాలు పెట్టుకోకుండా మా నాన్నగారు అయినా తను గురువు కాబట్టి దండిoచడం లో తప్పులేదని, దాని వల్లే తాను పట్టుపట్టి ఆంగ్లం చదువుకుంది అని తనకు అర్థం కావలి.
గురువు అందర్నీ సమానంగా చూస్తారు, ఒకరూ ఎక్కువా తక్కువా కాదు. ఇప్పుడు తన పిల్లలను కూడా తన గురువులు దండించడం చూస్తుంటే అయినా తనకు తెలిసి రావాలి. మమల్ని కూడా మా నాన్నగారు అయిన గురువు గారు దండించే వారు. కాబట్టి నిజాన్ని గ్రహించి ,తను మారితే సంతోషం. ఈ కథ తను చదువుతుందో లేదో నాకు తెలియదు కానీ ఇది నిజం . ఇలాంటి మనస్తత్వం ఉన్న వారు కూడా నిజాన్ని గ్రహించాలని, మారాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
-భవ్య చారు.