అస్తిత్వం
ఆడవారి అందాలకు
ఆశ పడతారు ఏంట్రా
అందం కనిపించినంత తేలిగ్గా
ఆ మనసు లోతుల్లో మరణించిన
అస్తిత్వం ఎందుకు కనిపించదురా
ఆడ జన్మ ఎత్తినందుకు
ఎక్కడ ఎలా నడిచినా
ఎన్ని అభ్యంతరాలు పెడతారో
ఆ అంతరాల వల్ల
నడకలో ధ్యైర్యం కోల్పోయి
బ్రతుకుతున్నాం కానీ
అదేంటో అందులో కూడా
నడుస్తుంటే నడుము
ఒంపులు కనిపిస్తాయా
తూ ఏమి బ్రతుకులురా
ఏముందిరా ఎద మీద
ఎత్తులు మాత్రమే వుంటాయా
ఆ ఎత్తుల్లో దాగిన లోలోతుల్లో
గుండె పొరల్లో ఎన్నో
వ్యథలు రగులుతుతుంటాయి
అవి మాత్రం కనబడవు ఏంట్రా
కళ్ళుమూసుకుని కామాంధులై
వెనక బడతారు ఏంట్రా
మారండ్రా బాబు
అమ్మాయిలు అందరూ
అందాల దేవకన్యలే కారు
నీ కోరికల వరాలు తీర్చడానికి
విధి రాతకి
చిక్కిన మీనమల్లే
వేటగాడి వలలో
చిక్కిన లేడిపిల్లలే
ఎన్నో బంధిలకు
బలై బ్రతుకు ఈడుస్తూ
గడిపేస్తున్నారు అయినా
కృంగుబాటును కృంగదిస్తూ
ఈ దారిద్ర్యాన్ని అంతం చేసే
అవకాశం కోసం ఎదురు చూస్తూ
గాలాన్ని కూడా గుచ్చేయాలని
వలని కూడా వలెయ్యాలని
ఎదురు చూస్తూ మెదడులను
సాన పెడుతున్నారని
గుర్తు పెట్టుకో మర్చిపోకు
ఇంకోసారి అందం
అమ్మాయి అంటే
అక్కడే నీ తల నరికేసి
జగన్మోహినికి నైవేద్యం
పెట్టే కాళికలు కూడా అని…
-గురువర్ధన్ రెడ్డి