అస్తవ్యస్త కరోనా
అయ్యెా! అస్తవ్యస్త కరోనా
ఎందుకైందండి మంచి కరోనానే!
మనల్ని మాత్రమే అస్తవ్యస్తం చేసింది..
దాని ఉధృత ప్రభావం చూపి కొంత మంది
ఆత్మీయులను మనకు దూరం చేసింది..
భయం గుప్పిట్లో బ్రతికేలా భయపెట్టేసింది..
మనతో ఆట లాడుకుంది..
మా చిన్నమ్మ కొడుకు నా కన్నా
రెండు సంవత్సరాలు పెద్దోడు కానీ ఇద్దరం సేమ్ చదువే!
ఎందుకంటే నన్ను మా అక్క టీచరు కనుక ఎక్కువ ఏజ్
వేసి చదివించింది..
అయితే ఆ అన్నయ్య నాకు ఫ్రెండు లాగా కూడా! మా
ఇంట్లోనే చదివేవాడు వాళ్లది పల్లెటూరు కనుక పది
తరువాత ఇద్దరం ఇంటర్ మా ఊర్లోనే చదివాం! నాకు
మా అన్నయ్యల కన్నా ఆ అన్నయ్యంటే చాలా ఇష్టం
అలాంటి అన్నయ్యకు కరోనా వచ్చి
చావు అంచుల వరకు వెళ్లి మళ్లీ తిరిగి వచ్చాడు..
నిజంగా చాలా భయపడి పోయాం!
చనిపోయిన ఆత్మీయులు కూడా చాలా మందే ఉన్నారు..
ఏం చేస్తాం? ఏదైనా మన చేతిలో లేదు కదా!
ఆ దైవం చేతిలో ఆట బొమ్మలం అంతే కదా!
కరోనా పేరు తలుచుకుంటేనే ..
అమ్మెా! చాలా భయం..
-ఉమాదేవి ఎర్రం
Meru cheppindhi nijame medam..