ఆశాపాశం
చిరుజల్లు జల్లి వెళ్ళిపోయినా మేఘం , అందాలు ఆరబోస్తున్న ఆకాశం, సంధ్యా సమయాన అందంగా ఆకాశానికి రంగేసిన సూర్యుడు, చిరు చలిని వెచ్చబరుస్తు చేతిలో పొగలు కక్కుతున్న కాఫీ , తన 63 ఏళ్ళ జీవితపు ఆలోచనలతో సుబ్బారావు గతంలోకి వెళ్ళిపోయాడు,
ఆ ఆలోచనలలో పుడుతున్న తన ప్రశ్నలకి తానే సమాధానం చెప్పుకుంటున్నాడు
సుబ్బారావు :- నా చేతుల్తో సంపాదించుకున్న ఇంత ఆస్థి ,గౌరవం , చక్కటి భార్యాపిల్లలు, మనవళ్ళు, ఎందరో కోరుకున్న అద్భుతమైన జీవితం ఎలా సాధించాను? అమ్మానాన్న మాటలు వినని వాడిని, చదువు లేని వాడిని, పిరికి వాడిని, తెలివిలేని వాడిని అన్నిటికిమించి చాల అసమర్థుడను ఇన్ని సాధించడానికి కారణం ఏమిటి?
ఈ ప్రశ్నకు తనకు తానే బదులిచ్చుకున్నాడు సుబ్బారావు
సుబ్బారావు :- ప్రేరణ, డబ్బు పై నీకున్న ఆశ నిన్ను ప్రేరేపించింది, నీ కోరికలు , ఆశలు, సరదాలు తీర్చుకోడానికి అవసరమైన డబ్బు లేదు నీకు
ఆకతాయి అల్లరి పిల్లాడివి అయినా నువ్వు నీ స్నేహితుడు వేసుకున్న కొత్త రకం చెప్పులూ చూసి నీకు అవి కావాలి అని ఆశపడ్డావు. కానీ వాటిని కొనడానికి అంత చిన్న వయసులో డబ్బు సంపాదిందే ప్రయత్నంలో నిరాశపడలేదు. నీ అంతట నువ్వు పని వెతుకుని నెలరోజులు కష్టపడి నువు కోరుకున్నది దక్కించుకున్నావు.
నీ జీవితంలో నీ ఆశలూ నీ కోరికలే నీ ప్రేరణా నీ జీవితంలో ఇంత ఎత్తుకు ఎదగడానికి కారణం
అది ప్రేరణ యొక్క అవశ్యకత అని తనకు తనే భాధలు తలుచుకుని తన చక్కటి సాయంత్రాని గడిపేశాడు
– భవానీ