ఆశ
నేనైతే ఆశల మేడలు..
చాలా కట్టుకున్నా..
దేవుడేమెా నా మేడలను..
కట్టుకునేలా చేయలేదు..
పేక మేడల్లా కూల్చేసాడు..
తిరిగి లేచి మళ్లీ కట్టా..
పోయేదేముంది??
ఆశల మేడలే కదాని మళ్లీ కట్టేసా!
ఏం చేస్తాడో చూడాలి మరి..
నెరవేరుస్తాడా?
మళ్లీ పేక మేడల్లా కూల్చేస్తాడా??
నెరవేర్చాలని మీరూ చెప్పండే!
నా తరుపున దేవుడికి..
-ఉమాదేవి ఎర్రం