అసహన జీవనం

అసహన జీవనం

ఇంజినీరింగ్ పూర్తయిన తర్వాత ఉద్యోగం కోసం వేట ప్రారంభించి రెండేళ్లు గడిచిన తర్వాత ఒక MNC కంపెనీ లో ఉద్యోగం సంపాదించి బుద్దిగా ఉద్యోగం చేసుకుంటున్నాడు శ్రీరామ్.  

తాను రిటైర్డ్ అయ్యేలోపు తన కొడుకుని ఉద్యోగిగా చూడాలనుకున్నాడు శ్రీరామ్ తండ్రి గోపాల్ రావు. అనుకున్నట్టుగానే తన రిటైర్మెంట్ కి రెండేళ్ల ముందే శ్రీరామ్ కి ఉద్యోగం రావడం తో శ్రీరామ్ అడగకముందే తనకి బైక్ ని బహుమతిగా ఇచ్చాడు గోపాల్ రావు.

తన తండ్రి కొనిచ్చిన బైక్ మీదే ఆఫీస్ కి బయల్దేరాడు మన కథానాయకుడు. అది చాలా పెద్ద కంపెనీ.. దక్షిణ భారతదేశం లోని వాళ్ళు, ఉత్త్తర భారతం వాళ్ళు ఇంకా చెప్పాలంటే ఈశాన్య రాష్ట్రాల యువతీ యువకులు పనిచేస్తారు ఆ కంపెనీ లో.

ఇంజనీరింగ్ పూర్తి అవ్వగానే ఉద్యోగ వేటలో పడి అమ్మాయిల ఊసే మర్చిపోయిన శ్రీరామ్ ఉద్యోగం దొరికాక అమ్మాయిల గురించి ఆలోచించడం మొదలెట్టాడు. ఎలాగైనా తన ఆఫీసులోనే ఒక మంచి తెలుగమ్మాయిని ప్రేమించి పెళ్లిచేసుకొని సెటిల్ అవ్వాలన్నది మనోడి ప్లాన్ ..

ఆఫీస్ కి చేరుకున్న శ్రీరామ్ తన సిస్టం ను ఆన్ చేసి ప్రాజెక్ట్ వర్క్ చెయ్యడం మొదలుపెట్టాడు. అలా శ్రీరామ్ పనిలో నిమగ్నమయి ఉండగా “హాయ్ శ్రీ హౌ అర్ యూ” అని పలకరించింది మేఘన.

మేఘన చాల తెలివైన, అందమైన అమ్మాయి. అమ్మాయిలు కూడా అబ్బాయిల్లాగానే ఉద్యోగం చేయగలరని, అమ్మాయిలు అబ్బాయిల కంటే ఎందులో తక్కువకారని గట్టిగ విశ్వసించే అమ్మాయి అందుకే బెంగళూరు లో తన కుటుంబాన్ని వదిలి ఎక్కువ జీతం వస్తుందని భాగ్యనగరానికి వచ్చి మరి ఉద్యోగం చేస్తుంది.

మేఘన పలకరింపు విని వెనక్కి తిరిగి చూసి శ్రీ రామ్ “అయాం ఫైన్ మేఘన వాట్ అబౌట్ యూ” అని తిరిగి అడిగాడు

“అయాం కూల్” అని సమాధానమిచ్చింది మేఘన చిన్నగా నవ్వుతూ

“ఓకే శ్రీ క్యారీ ఆన్ ఐ క్యాచ్ యూ లేటర్ బాయ్” అని చెప్పి వెళ్ళింది మేఘన

అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలి అని ఒక నిర్ణయంతో ఉన్న శ్రీ.. మేఘన గురించి ఆలోచించడం ప్రారంభించాడు. తాను నేను ఒకే ఆఫీస్.

తనది నాది సేమ్ శాలరీ ఆఫీస్ లో అందరి అమ్మాయిల కన్నా తెలివైంది మేఘన… మేఘనని ప్రేమించి పెళ్లిచేసుకోవాలి… తాను నేను బెస్ట్ పెయిర్ అవుతాం అని తన మనసులో అనుకున్నాడు శ్రీ.

**************

మధ్యాహ్నం భోజన సమయం లో ఆఫీస్ లోని కేఫ్ లో జ్యూస్ త్రాగుతూ ఒంటరిగా కనపడింది మేఘన… ఇదే మంచి సమయం మేఘన కి ప్రేమ, పెళ్లి మీద ఎలాంటి అభిప్రాయాలున్నాయి తెలుసుకోవడానికి, ఇంకా తనకు ఎవరైనా బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారో తెలుసుకోవడానికి కూడా.. అని నిర్ణయించుకుని మేఘన కూర్చున్న టేబుల్ దగ్గరికి వెళ్ళాడు శ్రీ .

“హాయ్ మేఘన”

“హాయ్ శ్రీ కం సిట్”

తన సెల్ లో గేమ్ ఆడుతూ జ్యూస్ తాగుతున్న మేఘనని.. శ్రీ

“మేఘన ఐ వాంట్ టు టాక్ విత్ సం పర్సనల్ మేటర్” అన్నాడు

“ఒహ్హ్ పర్సనల్ మ్యాటర్ అయితే ఆఫీస్ లో వద్దు బయట మాట్లాడుకున్దాము” అంది మేఘన

“హ్మ్ ఒకే మేఘన సాయంత్రం ఆఫీస్ వెనకాల ఉన్న పార్క్ లో కలుద్దాం” అన్నాడు

“ఒకే సరే షార్ప్ 5 ;30 బాయ్” అని వెళ్ళింది మేఘన..

శ్రీ కూడా వెళ్ళిపోయాడు

**********

సమయం 5 ;30 అవుతుంది. శ్రీ, మేఘనకి తన ప్రేమ విషయం ఎలా చెప్పాలో అని ఆఫీస్ వెనకాలే ఉన్న పార్క్ లో ప్రాక్టీస్ చేస్తుండగా

“హాయ్ శ్రీ” అని పలకరిస్తూ నడుచుకుంటూ వచ్చింది మేఘన శ్రీ దగ్గరికి

ఇద్దరు కలిసి నడుస్తుండగా

“చెప్పు శ్రీ ఎదో పర్సనల్ విషయం చెప్పాలన్నావు ఏంటి?” అని అడిగింది మేఘన

“మేఘన అది అది అని తడపడుతూ మేఘన ఐయామ్ ఇన్ లవ్ విత్ యు, ఐ వాంట్ టు మ్యారీ యు” అని మనసులో మాట చెప్పాడు శ్రీ

శ్రీరామ్ ప్రపోసల్ విన్న మేఘన ఆశ్చర్యపోలేదు, సంతోషపడలేదు, చిరాకు పడలేదు, మౌనంగా ఉంది, అలాగే నడుస్తూ ఉంది .. కొన్ని క్షణాలయ్యాక మేఘన అని పిలిచాడు శ్రీ

“యా….శ్రీరామ్” అంది మేఘన..

“నీకు నేనంటే ఇష్టమేనా, ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయా” అని అడిగాడు శ్రీ

“నో శ్రీ రామ్.. ముక్కు మొహం తెలియని వాడిని పెళ్లి చేసుకోవడం కన్నా, పరిచయం ఉన్న నీలాంటి వాడిని పెళ్లి చేసుకోవడం ప్రాబ్లెమ్ కాదు …”

“అంటే నేను నీకు ఇష్టమేనా అని ప్రశ్నించాడు” చిన్నగా నవ్వుతు …

“శ్రీ రామ్ నీకు మంచి ఉద్యోగం ఉంది, చూడడానికి బాగుంటావు నీలాంటి వాడు ఏ అమ్మాయికైనా నచ్చుతాడు” అని అంది మేఘన ..

“అయితే మనం పెళ్లి చేసుకుందామా మేఘన” అని సంతోషం తో నవ్వుతు అడిగాడు శ్రీ

“కం ఆన్ శ్రీ కూర్చొని చేసుకుంటే గంటలో అయిపోతుంది పెళ్లి, పెళ్లి చేసుకోవడం అసలు మ్యాటర్ కాదు” అంది

“మరేంటి? ఇంకా” అని ప్రశ్నించాడు శ్రీ .

**********

“చూడు శ్రీ నువ్వు ఆఫీస్ లో అబ్బాయిల్లో బెస్ట్ ఎంప్లొయీవి ,ఇంకా నేను అమ్మాయిల్లో… మనమిద్దరం బెస్ట్ అని ఎలా తెలిసింది? మనమిద్దరం ఆఫీస్ లైఫ్ ని షేర్ చేసుకున్నాం కనుక..

సో మనం పర్సనల్ లైఫ్ కూడా షేర్ చేసుకుందాం అప్పుడు నువ్వు నాకు బెస్ట్, నేను నీకు బెస్ట్ అని ఒకరికొకరు అనుకుంటే పెళ్లి చేసుకుందాం” అంది మేఘన…

“పర్సనల్ లైఫ్ షేరింగా అదెలా?” అని ప్రశ్నించాడు ఆశ్చర్యం తో శ్రీ..

“నేను చెప్పేది డేటింగ్ గురించి, మనం ఆర్నెల్లు కలిసుందాం ఆ తర్వాత కూడా మనం కలిసుందాం అని అనుకంటె పెళ్లి చేసుకుందాం…

ఈ ఆరు నెలల్లో ఒకరిగురించి ఒకరికి తెలుస్తుంది. ఏమంటావ్” అని అనింది మేఘన..

“ఒకే ఐ యామ్ రెడీ, ఐ అగ్రీ విత్ యు” అని చెప్పాడు శ్రీ.

*********

మరుసటి రోజే శ్రీరామ్ తన ఫ్రెండ్స్ తో ఉంటున్న గదిని ఖాళి చేసి కొత్త ఫ్లాట్ తీసుకున్నాడు… మేఘన కూడా తను ఉంటున్న హాస్టల్ ఖాళి చేసి శ్రీరామ్ తీసుకున్న ఫ్లాట్ కి షిఫ్ట్ అయ్యింది.

శ్రీరామ్, మేఘన సహజీవనం చేస్తున్నారన్న విషయం ఆఫీస్ లో అందరికి తెలిసిపోయింది. ఒకరోజు మధ్యాహ్నం ఆఫీస్ లోని కేఫ్ లో తన సహోద్యోగి అయిన శ్రావ్య, శ్రావణిలతో కలిసి భోజనం చేస్తుంది మేఘన.

“మేఘన నువ్వు చేస్తుంది కరెక్ట్ యేనా?” అని అడిగింది శ్రావ్య

“యా కరెక్ట్, ఏ లంచ్ టైం లో లంచ్ చేస్తున్నాం తప్పేముంది” అని ఎదురు ప్రశ్నించింది మేఘన

“కాదె .. నేను అడిగేది శ్రీరామ్ తో నువ్వు చేస్తున్న డేటింగ్ విషయం గురించి” అంది శ్రావ్య

“శ్రావ్యా…. నేను శ్రీరామ్ పెళ్లిచేసుకుందాం అని అనుకున్నాం.. అయితే పెళ్ళికి ముందు ఆర్నెల్లు కలిసి ఉంటున్నాం ఈ సమయం లో తనకి నేను, నాకు తాను తన పద్ధతులు నచ్చకపోయినా, తనకి నేను నచ్చక పోయిన ఒకరి గురించి ఒకరు అర్థం చేసుకోలేక పోయిన హ్యాపీ గ విడిపోతాం..

ఒకవేల ఒకరి పద్ధతులు ఒకరికి నచ్చితే హ్యాపీ గ పెళ్లి చేసుకుంటాం.. అంతే దీంట్లో తప్పేమి లేదు, దేశానికి వచ్చే నష్టమేమి లేదు” అని సమాధానమిచ్చింది మేఘన .

“కానీ అది మన సంప్రదాయం కాదు కదే” అని శ్రావ్య అడగ్గా

“నువ్వు ఊరుకోవే .. పాతకాలం ఆలోచనలు, నువ్వూనూ.. మేఘన చేసేది కరెక్ట్” అని మధ్యలో కలిపించుకొని మేఘనని సమర్థించింది శ్రావణి.

*********

ఒకరోజు రాత్రి నైట్ డ్యూటీ చేసుకొని ఇంటికి తిరిగొచ్చాడు శ్రీరామ్, ఆకలితో డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్లి గిన్నెలు తెరిచి చూసాడు అన్ని ఖాళీగా ఉండడం తో మేఘనా..

మేఘనా అని పిలుస్తూ మేఘన గదిలోకి వెళ్ళాడు ఏంటి మేఘన “నేను డిన్నర్ రెడీ చెయ్యమన్నానుగా ఎందుకు చెయ్యలేదు?” అని ప్రశ్నించాడు శ్రీరామ్

“సారీ శ్రీరామ్ నేను శ్రావణి బర్త్డే పార్టీ కి వెళ్తున్నాను… నువ్వు ఏదైనా రెస్టారెంట్లో తినే” అని చెప్పింది మేఘన.

“థిస్ ఈజ్ నాట్ ఫెయిర్” అన్నాడు శ్రీరామ్

“ఒక్కరోజు ఆడ్జస్ట్ చేసుకోలేవు మరీ ఇంత చాదస్తమ ఏంటి నీకు” అని కసురుకుంటూ వెళ్లిపోయింది మేఘన

************

ఆరోజు రాత్రంతా మేఘన ఇంటికి రాలేదు ఎంత ఫోన్ చేసిన ఫోన్ లిఫ్ట్ చెయ్యలేదు మరుసటి రోజు ఉదయం 10 గంటలకి తన ఆఫీస్ లోనే పనిచేసే జాన్, మేఘనని ఇంటిదగ్గర దిగబెట్టడం చూసాడు శ్రీరామ్ ..

మేఘన ఫ్లాట్ లోపలికి రాగానే “రాత్రంతా ఎక్కడున్నావ్? ఫోన్ ఎందుకు తియ్యలేదు? ఏమయి పోయావ్” అని ప్రశ్నించడం మొదలెట్టాడు ..

“జస్ట్ స్టాప్ శ్రీ…… ఏంటి దొంగలని అడిగినట్టుగా ఇన్ని ప్రశ్నలు అడుగుతున్నావు..”

“రాత్రి లేట్ అయ్యింది, పైగా వర్షం శ్రావణి వాళ్ళ రూమ్ లో ప్లేస్ లేకపోవడం తో దగ్గర్లో ఉన్న జాన్ ఫ్లాట్ కి వెళ్ళాను చాలా ఇంకేమైనా చెప్పాలా” అంది చిరాగ్గా

“అంటే రాత్రంతా ఆ జాన్ గాడితో ఉన్నావా? అసలే వాడి క్యారెక్టర్ మంచిది కాదు అన్నాడు శ్రీరామ్”

“అవును.. ఉన్నాను వాడి క్యారెక్టర్ మంచిది కాకపోయినా నా క్యారెక్టర్ మంచిదేగా అంది మేఘన”

“నేను చూస్తున్నాను.. ఆఫీస్ లో నువ్వు ఆ జాన్ గాడితో చాలా క్లోజ్ గా ఉంటున్నావు. ఇప్పుడు రాత్రంతా వాడి గదిలోనే ఉన్నావ్ అన్నాడు”

“జస్ట్ షట్ అప్ శ్రీరామ్… తనూ,నేను ఒకే ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నాం సో కొద్దిగా క్లోజ్ గా ఉన్నాం, రాత్రి తన గదిలో ఉండడానికి రీసన్ చెప్పాక కూడా నువ్వు ఇలా మాట్లాడుతున్నావంటే నీకు ఎంత అనుమానమో నాకు అర్థం అవుతుంది.

నీలాంటి అనుమానం ఉన్న వాడితో ఉండలేను బాయ్” అని తన గదిలోకి వెళ్ళింది మేఘన కసురుకుంటూ.

“పో.. పో.. నువ్వు ఇప్పుడే నాకు భోజనం పెట్టకుండా పబ్ లు, పార్టీలు అని తిరుగుతున్నావు నిన్ను చేసుకుంటే నేను లైఫ్ లాంగ్ పబ్ లలో, నైట్ పార్టీలలో నిన్ను వెత్తుకొవ్వలి, లైఫ్ లాంగ్ నాకు పస్తులే” అని తన గదిలోకి వెళ్ళిపోయాడు శ్రీరామ్, ఇద్దరు ఎవ్వరికి చెప్పకుండా జాబ్స్ కి రిజైన్ చేసేసారు .

************

కొన్ని రోజులయ్యాక శ్రీరామ్ తన తండ్రి చుసిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు ,మేఘన కూడా తన తల్లి తండ్రులు చుసిన అబ్బాయినే పెళ్లిచేసుకుంది.

ఒకరోజు మేఘన భర్త శ్యామ్, పెళ్లయిన సందర్బంగా తను పని చేస్తున్న ఆఫీస్ వాళ్లకి, తెలిసిన ఫ్రెండ్స్ కి పార్టీ ఏర్పాటు చేసాడు. ఆ పార్టీ కి మేఘన పాత ఆఫీస్ లో పనిచేసే శ్రావ్య కూడా వచ్చింది.

“మేఘనను చూసి హే మేఘన ఏంటే, ఎక్కడుంటున్నవే? అలా సడన్ గా నువ్వూ, శ్రీరామ్ రిజైన్ చేసేసారు. పెళ్ళికి కూడా చెప్పలేదు, ఎవ్వరికి కాంటాక్ట్ లో కూడా లేరు..

శ్యామ్ ఎలా తెలుసు నీకు, అసలు శ్రీరామ్ ఎక్కడ?” అని ప్రశ్నల వర్షం కురిపించింది… “శ్యామ్ నా భర్త” అని మెల్లిగా మొహం దించుకొని సమాధానమిచ్చింది మేఘన.

*********

“ఒహ్హ్ అయితే నువ్వు శ్రీని పెళ్లిచేసుకోలేదన్నమాట అతనితో ఆలా ఆర్నెల్లు కలిసి ఉండి, ఊరంతా తిరిగి ఇప్ప్పుడు తనకన్నా బెటర్ పోసిషన్ లో ఉన్న శ్యామ్ ని పెళ్లిచేసుకున్నావన్న మాట. “థిస్ ఈజ్ వెరీ షేమ్” అని వెళ్ళిపోయింది. ఏడుచుకుంటూ తన గదిలోకి వెళ్ళిపోయింది మేఘన

ఇదంతా వేరే గదిలో నుండి చూసాడు శ్యామ్

***********

తన తండ్రి చుసిన అమ్మాయిని పెళ్లి చేసుకొని కొత్తగా తీసుకున్న ఫ్లాట్ లో ఉంటున్న శ్రీరామ్…. 

బయటికి కి బయలుదేరుతుండగా ఎదురుగ ఉన్న ఫ్లాట్ నుండి  వచ్చింది శ్రావణి.

“హే, శ్రీ హౌ అర్ యు ఎన్ని రోజులయ్యింది నిన్ను చూసి. ఏంటి నువ్వు మేఘన చెప్పాపెట్టకుండా జాబ్ మానేశారు. ఉందా అది లోపల దాని పని చెప్తా అని శ్రీరామ్ కు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా శ్రీరామ్ ఫ్లాట్ తలపులు తోసుకుంటూ లోపలి వెళ్లి మేఘన.. మేఘన.. ఎక్కడున్నావ్” అని పిలవడంతో కిచెన్ నుండి శ్రీరామ్ భార్య బయటికి వచ్చి 

“నాపేరు మీనా అండి మేఘన కాదు” అని అనింది చిన్నగా నవ్వుతు

“ఒహ్హ్ సారీ .. మల్లి వస్తాను” అని చెప్పి వెళ్ళిపోయింది శ్రావణి

మీనా మనసులో మేఘన ఎవరన్నా అనుమానం తలెత్తింది.

శ్రీరామ్ వెళ్ళగానే శ్రావణి ఫ్లాట్ కి వెళ్లి మేఘన ఎవ్వరో చెప్పాలని శ్రావణి మీద ఒత్తిడి చెయ్యడంతో మేఘన, శ్రీరామ్ ల విషయం మీనాతో చెప్పేసింది శ్రావణి.

**********

పార్టీ అయిపోయాక ,అందరు వెళ్ళాక మేఘన భర్త శ్యామ్.. ఏడుచుకుంటూ గదిలో కూర్చున్న మేఘన దగ్గరికి వెళ్లి

“మేఘన, నువ్వు ఏ తప్పు చెయ్యలేదని నేను నమ్ముతున్నాను, నువ్వు తప్పు చేసిన దానిలా ఏడవకు, నువ్వు చేసిన పొరపాటు ఈరోజుల్లో చాలా మంది చేస్తున్నారు.. నువ్వు నీ గతాన్ని మర్చిపో అని దగ్గరికి తీసుకొని ధైర్యమిచ్చాడు..” తనను అర్థం చేసుకునే భర్త దొరికాడని శ్యామ్ భుజం పై తల వాల్చి కన్నీరు పెట్టుకుంది మేఘన.

**********

 ఇంటికి చేరుకున్న శ్రీరామ్.. తన ఫ్లాట్ లోకి వెళ్లకుండా శ్రావణి ఫ్లాట్ లోకి వెళ్తాడు.. శ్రావణి, మీనా ఒత్తిడి చెయ్యడం తో మేఘన విషయం చెప్పానని చెప్తుంది.

కంగారుతో, భయం గా మీనా ఏమి అంటుందో అని భయపడుతూ తన ఫ్లాట్ లోకి వెళ్ళ్తాడు శ్రీరామ్

మీనా కిచెన్ లో ఉండగా.. తన దగ్గరికి వెళ్లి “నన్ను క్షమించు మీనా పెళ్ళికి ముందు నేను మేఘన తో అలా డేటింగ్ చెయ్యాల్సింది కాదు.. కానీ నేను ఏ తప్పు చెయ్యలేదు” అని చెప్తాడు.

దానికి మీనా “మీరు ఏ తప్పు చేసే వ్యక్తి కాదని నాకు తెలుసండి, మీరు మేఘన గురించి ఏమి చెప్పాల్సిన అవసరం లేదు, మీకు టీ కావాలా,కాఫీ నా” అని అడుగుతుంది

తనను అర్థం చేసుకొనే మంచి భార్య దొరికిందని సంతోష పడతడు శ్రీ.

-శ్రవణ్ కుమార్ రాజా

0 Replies to “అసహన జీవనం”

  1. ఇద్దరికీ అర్దం చేసుకునే వాళ్ళు దొరకడం వారి అదృష్టం .. మీకు అభినందనలు 💐💐💐💐💐

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *