ఆరుగాలం
పసి పాప పై అత్యాచారం చేసినట్లు
అవ్వ కొంగును గుంజినట్టు
పచ్చని పడుచు పిల్ల పిల్ల పై అఘాయిత్యం చేసినట్టు
నడీ బజారులో అమ్మాయిని నగ్నంగా నిలబెట్టినట్టు
నలుగురు చేరి రెండు నెలల పసి పాపను చిదిమినట్టు
ఆరుగాలం కష్టపడి,శ్రమించి, నిమిష నిమిషము
నిద్రకు దూరమై , కంటికి రెప్పలా కాపాడుకుంటే
ఒకే ఒక్క వాన తో అంతా తుడిచి పెట్టావు కదా రా
దేవుడా ఎందుకు ఇంత కోపం మేము అంటే నీకు
అటు నకిలిల గోలలు తప్పించుకుంటూ ఎలాగో
పంటను కాపాడుకుంటూ , ఆడపిల్లల గా , అందంగా
తయారు చేసుకున్న పంటను నాశనం చేసావు , ఇప్పుడు
నా గతేంటి నారాయణ
-భవ్యచారు