అర్థరాత్రి మద్దెల దరువు

అర్థరాత్రి మద్దెల దరువు

మా చిన్నప్పుడు ఒక పాత ఇల్లు ఉండేది ఆ ఇంట్లోకి ఎవరు పోవాలి అన్న భయపడి పారి పోయేవారు.అందరూ ఎందుకు ఇలా పారిపోతున్నారు. ఏముంది అందులో తెలుసుకోవాలనిపించింది రాజుకు. ఒకరోజు ధైర్యం చేసి ఇంట్లో అందరూ పడుకున్నాక అర్ధరాత్రి 12 గంటలకు పాడుబడ్డ పాత ఇంట్లోకి నెమ్మదిగా డోర్ తీసుకొని ప్రవేశించాడు. అక్కడ ఎటు చూసినా దుమ్ము ,ధూళి ,బూజు పట్టి మనిషి లోపలికి పోవడానికి వీలు లేకుండా కప్పేసి ఉంది.

అయినా అడుగులు ముందుకు వేస్తూ ,బూజును చేతులతో తీసేస్తూ లోపలికి వెళ్ళాడు. ఎటు చూసినా పాత సామాన్లు అటు ఇటు పడి పగిలిపోయి విరిగిపోయి దుమ్ము పట్టి ఉన్నాయి. ఏమీ లేని పాడుబడిన ఇంట్లో ఏమీ లేదు..?

ఈ ఇంటి పేరు చెబితేనే అందరూ చస్తున్నారు. ఈ ఇంట్లో ఏదో ఉన్నది అన్న అపోహ మాత్రమే అనుకోని, ఎలాగో వచ్చాను కదా, ఒక పది నిమిషాలు అంతా తిరిగి చూస్తాను. అనుకొని నెమ్మదిగా అంతా చూస్తూ నడుస్తున్నాడు.

ఒక ఐదు నిమిషాల వరకు తన చెప్పుల శబ్దమే తనకు వినిపిస్తూ ఉండేది. అలాంటిది ఏదో శబ్దం వినిపిస్తోంది. ఏమిటా శబ్దము గజ్జల సౌండ్ ఆ కాదు..? కానీ ఆ శబ్దానికి కాస్త భయం పుడుతోంది. కానీ భయపడి వెనకడుగు వేస్తే ఈ ఇంటి గురించి నేను తెలుసుకోలేను. జరిగేదేదో జరగక మానదు, కానీ తెలుసుకొని తీరాలి అని ధైర్యం తెచ్చుకొని ముందడుగు వేస్తూ నడుస్తున్నాడు.

ఎదురుగా నల్లని నీడ ఆకారంతో మనిషి ముందు కర్రతో చేసిన మద్దెలతో దరువు వాయిస్తున్నట్లు కనిపిస్తుంది.అర్థరాత్రి మద్దెల దరువు శబ్దం వినిపిస్తోంది. అమ్మో దయ్యం దయ్యం అంటూ బెంబేలెత్తిపోయి బయటకు పరుగులు తీశాడు.దయ్యం దయ్యం అంటూ అరుస్తున్న అరుపుకు అందరూ లేచి తలుపులు తీసుకొని బయటికి వచ్చి రాజును చేరుకున్నారు.

ఏమైంది ఏమైంది..? అని అడగగా అమ్మో ఆ ఇంట్లో ఒక్క దయ్యం అర్ధరాత్రి మద్దెల దరువు చేస్తోంది. అటువైపుగా ఎవ్వరు వెళ్ళకూడదు అని చెప్పాడు. తెల్లారే సరికల్లా అసలు విషయం ఊరంతా తెలిసిపోయింది.

బేతి మాధవిలత

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *