అర్థం
గుండెలనిండా జాతీయ భావన
ఉప్పొంగుతుంటే
భారతీయులందరూ
నావాళ్ళే అని
మనసా వాచా కర్మణా అనుకుంటూ
కుల మత ప్రాంత భావనలను పెకలిద్దాం
మనుషులుగా వికసిద్దాం
విశ్వమానవ స్ఫూర్తిని చాటుదాం
సందేహాలనొదిలి సందేశమవుదాం
దేశమాత ఆదేశమవుదాం
అప్పుడు కదా జెండా ఉంఛారహే హమారా
అన్న మాటకు అర్థం తెలిసేది
-సి.యస్.రాంబాబు