అపురూపమైన స్నేహ బంధం
” ఒరే రహీం, నాకు అమెరికాలో జాబ్ వచ్చిందిరా.అయితే అక్కడికి వెళ్ళేందుకు నా వద్ద డబ్బులు
లేవు రా” అన్నాడు మనోజ్ తన స్నేహితుడైనరహీంతో. మనోజ్, రహీం ఇద్దరూ బాల్యస్నేహితులు.
వారి ఇళ్లు దగ్గరగా ఉంటాయి కాబట్టి ఇప్పటికీ కూడాకలిసే ఉంటున్నారు. ఈ మధ్యనే మనోజ్ తన చదువుపూర్తి చేసుకుని ఉద్యోగ ప్రయత్నం చేయసాగాడు.
అదృష్టవశాత్తూ అతనికి అమెరికాలో ఉద్యోగంవచ్చింది. అయితే అక్కడికి వెళ్ళటానికి అతనిదగ్గర డబ్బులు లేవు.
అదే విషయాన్ని రహీంతోచెప్పాడు. ఇద్దరిదీ మధ్యతరగతి కుటుంబమే.ఒక బట్టల షాపు ఓపెన్ చేయాలని రహీం కల.అందుకోసం అహర్నిశలు కష్టపడి పనిచేసాడు
షాపు కొనేంత డబ్బు సంపాదించాడు. రెండురోజుల్లో ఒక షాపును కొని తన పేరున రిజిస్ట్రేషన్ చేసుకునే ప్రయత్నంలో ఉన్నాడు.
ఇప్పటివరకురహీం ఒక షాపులో గుమస్తాగా పనిచేస్తూ ఉన్నాడు.ఇన్నాళ్ళకు తన కల నెరవేరుతుంది అనుకునేసమయంలో మితృనికి డబ్బుతో అవసరం వచ్చిందిఅని తెలుసుకుని తన కష్టార్జితాన్ని ఇచ్చేసాడురహీం.
మితృడు చేసిన సహాయానికి ధన్యవాదాలుతెలిపి ఉద్యోగంలో చేరటానికి అమెరికా వెళ్ళాడుమనోజ్.
భవిష్యత్తులో మనోజ్ రహీంకు డబ్బులుపంపించవచ్చు, పంపించకపోనూ వచ్చు కానీ తనమితృడి కల సాకారం చేసేందుకు తన భవిష్యత్తుత్యాగం చేసిన రహీం నిజమైన మితృడు.
-వెంకట భానుప్రసాద్ చలసాని