అపరిమితమైన సంతోషం
కొత్త ఇల్లు కొనాలని మోహన్ ప్లాన్ వేసాడు. పెళ్ళైన మొదటి సంవత్సరమే బ్యాంకు లోన్ తీసుకుని అపార్ట్మెంట్ కొనాలి అని అతని ఉద్దేశ్యం. భార్య కూడా అందుకు ఒప్పుకుంది. మొత్తానికి పేపర్ వర్క్ పూర్తి అయ్యింది. మంచి జీతం వచ్చే ఉద్యోగం అవటం వల్ల అతనికి తొందరగా హౌసింగ్ లోన్ సాంక్షన్ చేసారు బ్యాంకు వారు.
భార్య కూడా ఉద్యోగస్తురాలే. ఆమె కూడా పెళ్ళికి ముందే కొంత డబ్బు వెనకేసింది. ఆ డబ్బు కూడా తన భర్తకు ఇచ్చి ఇంటికి వాడమని చెప్పింది. తనను అర్థం చేసుకునే భార్య దొరికినందుకు మోహన్ కు ఆపలేని సంతోషం కలిగింది. జీవితంలో పెళ్ళి చేసుకోకూడదు అని అనుకున్న మోహన్ పెద్దల బలవంతం మీద పెళ్ళి చేసుకున్నాడు.
అతను పెళ్ళంటే చాలా భయపడ్డాడు. అతను భయపడినట్లుగా ఏమీ జరగలేదు. అంతా మంచే జరిగింది. అనుకూలవతి అయిన భార్యా దొరికింది. తర్వాత కొన్ని సంవత్సరాలకే వారు హౌసింగ్ లోన్ తీర్చేసి పిల్లా పాపలతో హాయిగా ఉన్నారు. జీవితంలో ప్రతి విషయానికి భయపడవద్దు. అర్థం చేసుకునే కుటుంబ సభ్యులు ఉంటే సంతోషంగా ఉండవచ్చు.
– వెంకట భానుప్రసాద్ చలసాని.