అపార్థం
ఎన్ని అనర్థాలకైనా దారి తీస్తుంది అపార్థం..
ఇదే జరిగితే జీవితానికి అది పూడ్చలేని అనర్థం..
వినగూడని మాట మన గురించి విన్నా..
చెప్పగూడని మాట మన గురించి చెప్పినా..
అబద్దం ఒక మనిషిని కూల్చే ఆయుధం..
అవాస్తవం ఒక మనసును కాల్చే ఇంధనం..
అశ్వథ్థామ హతః కుంజర..
ఇది నిజాన్ని దాచిన అబద్దం..
దాని పర్యవసానం ద్రోణాచార్యుని మరణం..
తిమ్మరుసు కళ్లను తొలిచాక తెలిసెను
కృష్ణ దేవరాయలు కు అసలైన నిజం..
అపార్థానికి జరిగిన అనర్థం..
అందుకే..
ఆలస్యమైనా నిజమేంటో తెలుసుకో..
అపార్థం మించిన అనర్థం లేదని మసలుకో..
నీ జీవితంలో అపార్థానికి తావివ్వకు..
నిజ జీవితం లో అనర్థాలకు చోటివ్వకు..
–ఆదిత్య శివశంకర కలకొండ