అపార్థం
రాజేష్ , మీనాలకు కొత్తగా పెళ్లయింది. పెళ్లిలో మీనాన్ని చూసి“నువ్వు చాలా అదృష్టవంతురాలు. నీకు మంచి కోడలు దొరికింది” పెళ్లికి వచ్చిన బంధువులు చెప్తున్నావు.
ఆ పొగడ్తలకి పొంగిపోయి” ఏరి కోరి ఈ కోడల్ని తెచ్చుకున్నాను. నా కొడుకు మనసు కూడా గెలుచుకుంది” అని ఆనందంగా చెప్పింది రాజేశ్వరి.
పెళ్లి చాలా బాగా జరిగింది అని అందరూ చెప్పుకుంటుంటే రాజేశ్వరి ఆనందానికి హద్దులు లేవు.మరసటి రోజు శుక్రవారం కాబట్టి మీనా ఉదయాన్నే లేచి తలార స్నానం చేసి పూజ చేస్తుంది.
అప్పుడే లేచిన రాజేశ్వరి మీనాని చూసి ఆనందంగా కిచెన్ లోకి వెళ్లి కాఫీ పెట్టుకుంది.రాజేష్ లేచి సోఫాలో కూర్చొని పేపర్ చదువుతున్నాను. ఐదు నిమిషాల తర్వాత రాజేశ్వర్ కిచెన్ నుంచి రాజేష్ కి కాఫీ ఇచ్చి తను కాఫీ తీసుకొని తాగింది.
కాసేపు పేపర్ చదువుకొని ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయాడు రాజేష్.పూజ చేసుకొని వచ్చిన మీనా“అయ్యో… అత్తయ్య ఎందుకు మీరు కాఫీ పెట్టుకున్నారు. నేను పెట్టి ఇచ్చేదాన్ని కదా” అని చెప్పింది.
“నువ్వు పూజలో ఉన్నావు కదా అమ్మ పరవాలేదు” అని చెప్పింది రాజేశ్వరి.“సరే అత్తయ్య ,నేను వెళ్లి టిఫిన్ రెడీ చేస్తాను. మీరు వెళ్లి ఫ్రెష్ అయ్యి రండి” అని చెప్పింది మీనా.
“హ్మ… సరే” అని చెప్పింది రాజేశ్వరి.మీనా వెళ్లి టిఫిన్ రెడీ చేసింది. ఆఫీస్ కి రెడీ అయ్యాడు రాజేష్.డైనింగ్ టేబుల్ మీద వచ్చేసాడు రాజేశ్వరి , రాజేష్ లు. టిఫిన్ చేసి “అమ్మ నేను ఆఫీస్ కి వెళ్తున్నాను బాయ్ మీనా” అని చెప్పాడు రాజేష్.
“సాయంత్రం త్వరగా రా నా ఫ్రెండ్స్ వస్తున్నారు” అని చెప్పింది రాజేశ్వరి.
“అలాగే అమ్మ” అని చెప్పి వెళ్ళిపోయాడు రాజేష్.“సాయంత్రం నా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు కట్టుకోవడానికి మంచి చీర కబోర్డ్ లో పెట్టాను ఆ చీర కట్టుకో” అని చెప్పింది రాజేశ్వరి.
“అలాగే అత్తయ్య” అని చెప్పింది మీనా.సాయంత్రం రాజేశ్వరి వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు.“నీ కోడలు ఎక్కడ రాజేశ్వరి ఇంకా కనిపించలేదు” అని అడిగింది లలిత.
” రెడీ అవుతుంది. నేను వెళ్లి తీసుకొస్తాను మీరు మాట్లాడుకోండి” అని చెప్పి రూంలోకి వెళ్ళింది రాజేశ్వరి.“మీనా రెడీ అయ్యావా? నా ఫ్రెండ్స్ నీకోసం ఎదురు చూస్తున్నారు” అని చెప్పింది రాజేశ్వరి.
“హా… రెడీ అయ్యాను అత్తయ్య” అని చెప్పి రూమ్ నుంచి బయటకు వచ్చింది మీనా.రాజేశ్వరి మీనాని హాల్లోకి తీసుకొని వెళ్ళింది.“నీ కోడలు మొహంలో ఉట్టిపడుతుంది లక్ష్మీ కళ” అని చెప్పింది లలిత.“నేను వెళ్లి కాఫీ తీసుకొస్తాను అత్తయ్య” కిచెన్ లోకి వెళ్ళిపోయింది మీనా.
ఈ లోపు రాజేష్ వచ్చాడు.“ఆంటీ ఎలా ఉన్నారు?” అని అడిగాడు రాజేష్.“నేను బాగున్నాను రాజేష్. మీ ఆవిడ ఇంకా బాగుంది” అని చెప్పింది లలిత.
ఒకరోజు మీనా కి ఫోన్ వచ్చింది. ఆ నెంబరు కొత్తగా ఉంది. ఈ నెంబర్ ఎవరబ్బా అనుకోని లిఫ్ట్ చేసింది మీనా.“హలో… ఎవరు?” అని అడిగింది మీనా.
“నేనే… రాధికని” అని చెప్పింది.“నువ్వా… ఈ నంబర్ ఎవరిది? నా పెళ్ళికి ఎందుకు రాలేదు?” అని అడిగింది మీనా.
“అది…. అది…. నేను , మురళి ఎవరికీ తెలియకుండా పెళ్లి చేసుకున్నాము. ఈ విషయం నువ్వు కూడా ఎవరికీ చెప్పకు. నాకు కొంచం డబ్బులు కావాలి” అని అడిగింది రాధిక.
“అవునా… అసలు మీరు ఎక్కడ ఉన్నారు. సరే సాయంత్రం నీకు డబ్బులు పంపిస్తాను” అని చెప్పింది మీనా.
“చాలా థాంక్స్ యూ వే. అలాగే నా నంబర్ కూడా డిలీట్ చెయ్యి” అని చెప్పింది రాధిక.
ఇలా అప్పుడెప్పుడు కాల్ చేసి మాట్లాడుకునే వాళ్ళు.ఒకరోజు మీనా కాల్ మాట్లాడుతుండగా రాజేష్ ఆఫీస్ నుండి వచ్చి గోడ చాటు విన్నాడు.రెండు , మూడు సార్లు రాజేష్ విని అపార్థం చేసుకున్నాడు.
తనలో అనుమానం పెంచుకున్నాడు. ఈ విషయం ఎవరికి చెప్పకుండా తనలో తనే ఉక్కిరిబిక్కిరి అయిపోయేవాడు.
రాజేష్ మీనా ఫోన్ చూసిన కూడా నంబర్ లేదు. ఇంకా తనలో అనుమానం పెరిగింది.
రాజేశ్వరి ఉంది అని మీనాతో నార్మల్ గా మాట్లాడేవాడు రాజేష్. రాజేశ్వరి లేకపోతే మాత్రం ఇంట్లో మీనాని కొట్టి గట్టిగా నిలదీయాలని అనుకున్నాడు.
రెండు నెలలు తర్వాత ఒక రోజు రాధిక , మురళీ కలిసి మీనా ఇంటికి వచ్చారు. రాజేశ్వరి,రాజేష్ కి మేము ఇద్దరం ప్రేమించుకున్నాం.
మా పెద్దలు ఒప్పుకోలేదు. ఎవరికి తెలియకుండా మేము పెళ్లి చేసుకున్నాము. కొన్ని సమస్యల వల్ల డబ్బు కావాలని నేను మీనా కి ఫోన్ చేశాను.ఇప్పుడు మా పెద్ద వాళ్ళు ఒప్పుకున్నారు.
ఇప్పుడు నేను ప్రెగ్నెన్సీ గా ఉన్నాను. నేను ఫోన్ చేసిన ప్రతిసారి నా నంబర్ ని డిలీట్ చేయమని చెప్పాను మీనా కి.
రాధిక చెప్పిన మాటలు విని రాజేష్ తనలో నేను చాలా తప్పుగా అనుకున్నా. మీనా ని అపార్థం చేసుకున్నా. నా అనుమానానికి కారణం లేదు.
అందరూ కలిసి డిన్నర్ చేశారు. రాజేష్ లో ఉన్న అనుమానం కూడా తొలగిపోయింది.తన మనసులోనే మీనా క్షమాపణ చెప్పుకున్నాడు రాజేష్.
అనుమానం ఉంటే వెంటేనే అడిగేయాలి కానీ ఆ అనుమానం మరి ఎక్కువగా పెంచుకోకూడదు.కొందరిని అర్థం చేసుకోవడం అపార్థం చేసుకోవడానికి అదే కారణం అవుతుంది.
-మాధవి కాళ్ల