అనుక్షణం ఆమెకై నా నిరీక్షణ

అనుక్షణం ఆమెకై నా నిరీక్షణ

తెల్లారి వెలుగులు, కల్లాపి రంగవల్లులు, మామిడి తోరణాలు, పిండి వంటలు ఉగాది పచ్చడి తో ఇంటింటా ఉగాది సంబరాలు మొదలైయ్యాయి…. వేకవ జామునే పార్వతమ్మ పూజలు “ఏమయ్యా హారతి తీసుకోండి” అంటూ రామ్ నాన్న గారు శంకరయ్యని పిలిచింది.. ఆఆ వస్తున్న పార్వతి ఏంటి మన రాము ఉదయాన్నే ఇంట్లో హడావుడి పెట్టుకుంచా కట్టి జోరులో ఉన్నాడు పార్వతి ..

అంతా ఆ దేవుని దయ ఈ సంవత్సరం అయినా కళ్యాణం జరిగాలి… ఆ అమ్మ అవుతుంది లే నచ్చిన అమ్మాయి వస్తే అంటూ హారతి తీసుకోని… గుడికి వెళ్తున్న అమ్మ అంటూ వెళ్ళగా నేను వస్తాను రా అంటూ ముగ్గురు వెళ్ళారు.. గుడికి చేరుకోగానే అటు ఇటు నలుదిక్కులా తన కళ్ళు ఆ అమ్మాయి కోసం వెతుకుతునే ఉన్నాయి..

కాళ్ళకు గజ్జెలు అందెలు గళ్ళు గళ్ళు మంటూ సందెడితో తన పక్కన నుండి పూజారి దగ్గరకు చేరుకోని.. పాటకై సిద్దంగా ఉంది… తనలో ఏదో గుండె కదిలి నట్టు ఆ అమ్మాయి వైపు చూస్తూ అలాగే నిలబడి పోయాడు.. నెమ్మదిగా తన దగ్గరకు చేరుకొని వచ్చి తన తో మాట్లాడే ప్రయత్నం చేశాడు…

హాయ్ నమస్తే అండి మీరు పాట చాలా బాగా పాడారు మీ పేరు ఏంటి..

నా పేరు జానకి అంటూ చిన్న చిరునవ్వుతో సమాధానం చెప్పగానే ఎన్నో జన్మల బంధం ముడి వేసుకుంది అనేలా ఉంది అని రామమనసు పులకరింపుతో నిండిపోయింది…

గుడి అంతా తోరణాలు, పూజలు, పాటలతో అలంకరణమై మారుమ్రోగింది.. మాట మాట కలిసి వారి పరిచయం చాలా దగ్గరగా ఏర్పడింది.. ఇంతలో పార్వతమ్మ జానకి ఎలా ఉన్నావు ఎప్పుడూ వచ్చావు గుడికి అమ్మ నాన్న రాలేదా.. హ వచ్చారు అత్తయ్య అదిగో పూలమాలలు తీసుకుని వస్తున్నారు… అమ్మ జానకి నీకు ముందే తెలుసా ఎప్పుడూ మన ఊరిలో చూడలేదు నిన్ను అత్తయ్య అంటుంది ఏంటి….

నవ్వుతూ తను నా స్నేహితురాలు కూతురు రా, నీకు చాలా సందర్భాల్లో చెప్పా కదా నీకు పెళ్ళంటూ చేస్తే నా స్నేహితురాలు కూతురుతో చేస్తా అని తనే ఈ అమ్మాయి.. అని పార్వతమ్మ చెప్పాగానే రామ్ మనసులో చెప్పలేని ఆనందం ఒక్కసారి ఆకాశం దిగి వచ్చి చందమామ ని చేతిలో పెట్టినట్లు అనిపించింది….

ఇంతలో జానకి అమ్మ నాన్న శాంతమ్మ, చంద్రశేఖర్ ఇద్దరూ వచ్చి పార్వతమ్మ, శంకరయ్యలతో తమ వివాహం గురించి ఆ సీతారాముల గుడిలో ఉగాది పర్వదినాన జానకి రాముల పెళ్లి నిశ్చయం గురించి మాట్టడి ఒప్పందం చేసుకున్నారు… కొత్త తెలుగు పండుగరోజున తెలుగు తనం ఉట్టి పడేలా తెలుగు లోగిళ్లలో మురిసిపోయేలా ఊరు వాడ తమ పెళ్లి నిశ్చయం సందడి అయింది….

ఇలా ఉగాది పండుగ వారి జీవితంలో కొత్త ఉత్సాహం తెచ్చింది….

– సీత మహాలక్ష్మి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *