అనుకోని అతిథి

అనుకోని అతిథి

 

రోజులనే ఈ రోజు కాలేజీ కి వెళ్ళాను
ఎప్పుడు కాలేజీ మానేయని నా స్నేహితురాలు గీతా ఈ రోజు తో కాలేజీ మానేసి వారం అయ్యింది ఎందుకొ తెలిదు, విచిత్రం ఏంటి అంటే మా క్లాసు లో మరొ ముగ్గురు అమ్మాయిలు కూడా కనిపించట్లేదు ఎవరు ఎం అయ్యారో తెలిదు రోజంతా ఆలోచిస్తూ సాయంత్రం అయినది
ఇంటికి బయలుదేరాను కాలేజీ వీధి చివర ఒక కార్ ఉంది .

పక్కనే ఒక అడుగు పొడుగున్న జుట్టు కలిగిన వ్యక్తి నా స్నేహితురాలు గీతా ని చివరిసారిగా చుసింది అతని తోనే ఇప్పుడు అతను నా వైపు చూస్తున్నాడు, నా వెనుక వస్తు పక్కనే ఉంటూ నన్ను ఏదో అడిగాడు సమాధానం ఇచ్చాను , అతను నవ్వుతూ ఇంకొక మాట కలిపాడు తరువాత తన చేతిలో ఉన్న జ్యూస్ తాగమని నాకు ఇచ్చాడు నేను వద్దు అని కొద్ది దూరం లో కనిపిస్తున్న మా సీనియర్ అక్క దగ్గరకి వెళ్లి అతని కోసం చెప్పను అది విన్న తను నాకు తోడుగా వస్తుంది, కానీ అతను వెంబడించడం ఆపలేదు ఇద్దరం భయంతో పరుగెత్తుకుంటూ ఒక అపార్ట్మెంట్ లొకి వెళ్లాము ఎవరైనా కనిపిస్తే సహాయం అడగాలి అని కానీ అన్ని ఫ్లాట్ తలుపులు మూసి ఉన్నాయి తలుపు కొడితే మమల్ని వెంబడిస్తున్న పొడుగు జుట్టోడికి

మేము కనిపిస్తాం అని కొట్టలేదు మెట్లు ఎక్కుతూ ఎవరైనా కనిపిస్తారు అని చూస్తూ పరిగెడుతున్నాం అక్కడ ఒక ఫ్లాట్ మాత్రం తలుపులు తెరిచి ఉన్నాయి వెంటనే లోపలి వెళ్ళాం ఒక మహిళామమల్ని చూసి ఎవరు మీరు ఇంట్లోకి ఎందుకొచ్చారు బయటకెళ్ళండి అన్నది, మేము తలుపులు వేసి ఆవిడని బాల్కనీ లోకి తీసుకెళ్లి ఏమయిందో చెప్పాము కానీ ఆవిడ వెళ్ళిపోండి అని గట్టిగా అరుస్తుంది ఎందుకంటే మమల్ని దొంగలు అనుకుని , అప్పుడే మమల్ని వెతుకుతూ అతను అపార్ట్మెంట్లోకి వచేసాడు అది మేము బాల్కనీ నుండి చూసాం అతడిని ఆమెకు చూపిస్తూ, అదిగో అతడె మమ్మల్ని వెంబడిస్తున్నాడు అని చూపించిన తరువాత, ఆమె నమ్మి మమల్ని లోపలికి తీస్కెళ్ళి గదిలో దాచి మాకు నీళ్లుఇచ్చింది, ఆవేశపడుతున్న మేము నీళ్లు తాగి నిశ్శబ్దంగా ఉన్నాము హమ్మేయా తపించుకున్నం అనుకునాం

మా పక్కనుండి ఏదో బొంగురు పోయిన గొంతు శబ్దం బయపడుతు మెల్లిగా తల తిప్పి చుసి ఒక్కసారిగా ఉలిక్కిపడం ఎందుకంటే ఆ గొంతు మా కాలేజీ యూనిఫార్మ్ వేసుకున్న ఒక అమ్మాయిది నేను మెల్లిగా కింద పడి ఒక తెల్లటి తెర వెనుకనుండి వస్తున్న ఆ అమ్మాయిదగ్గరకి వెళ్ళాను, ఆ అమ్మాయి ఏదో చెప్పాలనుకుంటుంది.  కానీ నా దృష్టి ఆ తెల్లటి తెర పై పడింది ఆ తెరని కొంచెం పక్కకి తొలగించి చూసాక నా వెన్నులోవణుకు పుట్టింది.

ఎందుకంటే కనిపించకుండా పోయిన నా స్నేహితుల తో సహా 20 మందికి పైగా అమ్మాయిలు ఉన్నారు అది చూసి వెంటనే నా కళ్ళు బయర్లుకమ్మాయి తల బరువెక్కింది, మా సీనియర్ అక్క ని పిలుస్తూ అక్కా అక్కా అన్నాను ఎ సమాదానం రాకపోవడంతో వెనుదిరిగి చూసా నేలరాలిపోయిన మా సీనియర్ అక్క ని చూసి నా తల మరింత బరువెక్కింది కళ్ళు తిరగడం మొదలయింది అప్పుడే అర్ధం అయింది నాకు నా తల బరువెక్కడానికి కారణం నేను ఆవిడ ఇచ్చిన నీళ్లు తాగడం వల్ల నా శరీరం నా ఆధీనంలో లేదు ఈలోగా నెను ఉన్న గది తలుపులు తెరుచుకున్నాయి , నాకు నీళ్లు ఇచ్చిన ఆవిడ, పొడుగు జుట్టు మనిషి ఇద్దరు నా వైపు చుస్తూ ఇలా అన్నారు

“చేప వలలో తనంతట తానే వచ్చి చిక్కుకుంది ”
అని నవ్వసాగారు.

మత్తు వాళ్ళ పూర్తిగా మైకంలోకి వెళ్లి నిద్రలోకి జారుకున్న ఈలోగా మా అమ్మ వచ్చి ఫ్యాన్ ఆపేసింది నేను కంటున్నా కల నుండి మెలుకువ వచ్చేసింది. ఎప్పటిలా కాలేజీ కి వెళ్ళాను
నా నరాలు బిగుసుకుపోయే దృశ్యం
మా కాలేజీ బయట నా కలలో వచ్చిన అదే కార్ ముందు నిలబడి నన్నే చూస్తున్న అదే పొడుగు జుట్టు మనిషి 😧
అనుకొని అతిధిలా వచ్చాడు

-భవాని

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *