అనుబంధాలు నిలబడాలంటే
ఇతరులతో అనుబంధం నిలబడాలంటే వారితో మనం మంచిగా మసలుకోవాలి. వారితో తరచుగా మాట్లాడాలి.మన కష్టసుఖాలను వారితోపంచుకోవాలి. అనుబంధాలు నిలుపుకోవటం చాలా కష్టం.
ఒక్క కటువైన మాటతో ఆ బంధం శాశ్వతంగా దూరం అయ్యే అవకాశం ఉంది. నేనుప్రతిలిపిలో రచనలు చేసే వాడిని. ప్రతిలిపి వారు కొందరిని సన్మానించారు. ఆ సభలో నన్ను కూడా సన్మానించారు. అప్పుడు ఆ సభకు వెళ్ళే వారంతాఒక వాట్సప్ గ్రూప్ పెట్టుకున్నారు. ఆ గ్రూప్ నేటికీ ఉంది. అక్షరలిపి గ్రూపులోకి రావటం అనేది ఆ గ్రూపులోనుండే జరిగింది.
అప్పుడు ఆ గ్రూపులో ఉన్నఎడ్మిన్ ఇప్పడు ఈ గ్రూపులో ఉన్న ఎడ్మిన్ ఒకరే. భవ్య గారుగ్రూప్ ఎడ్మిన్ గా ఉన్నారు. నిజంగా చెప్పాలంటే గ్రూపులో ఉన్న సభ్యులందరితో నేను ఒకసారి కూడా కలవలేదు. కనీసం ఫోనులో కూడా మాట్లాడలేదు.
అయినాఅదే వాట్సప్ గ్రూపులో కలుస్తాము. అదే ఒక గొప్పఅనుబంధం. ఇప్పటికి ఐదేళ్లయ్యింది. అయినా గ్రూపులోమెసేజులు పెడుతూ ఉంటాము.
నేను చెప్పేది ఏమంటే గ్రూపులో ఉన్నరచయితలు ఒకరినొకరు పలకరించుకుని,ఒకరి కధలు మరొకరు చదివి ప్రోత్సహించుకుంటే ఆ అనుబంధాలు పెరుగుతాయి.
మంచివారితో అనుబంధంపెంచుకుంటే జీవితాన్ని సంతోషంగా గడపవచ్చు.
-వెంకట భానుప్రసాద్ చలసాని