‘అ’ నుబంధం లో ‘ఆ’ నందం
అక్షరం అంటే అమ్మ!
ఆడపిల్ల అంటే ఆదిశక్తి!
అండ అంటే అన్న!
ఆదర్శం అంటే నాన్న!
అహం అంటే శత్రువు!
ఆధారం అంటే మిత్రుడు!
అభివృద్ధి అంటే వెలుగు!
ఆగిపోవటం అంటే చీకటి!
అన్నిటినీ, అందరినీ సమానం అనుకుంటే!
సంయవనంతో, సహృదయంతో స్వీకరిస్తే,
అందమైన భవిష్యత్తు.
ఆది, అంత్యం, అన్ని కాలాలను ఒకేలాగా ఆస్వాదిస్తే, అదే సంతృప్తికరమైన జీవితం.
– బి రాధిక