అంతర్ముఖుడినై!!!
నీ కురుల కేరింతలు,
చిరు గాలులను కవ్వించు చుండెను.
రెట్టించెను ఆరబోసి అవి
నీ అందాలను……….!
నీ ఆవాస శిల్పి
ఎవరో కాదే …………..!
అది నీ చిరు మందహాసమే!
నీ నివాసము
నా ఆశ్రమము
జోడు గూళ్ళే….!
ఇట్లు తప్పెను నిన్ను వెదక
నా ఆయాసము………..!
కిటికీలు చిన్న వాయెనే
చూడ లేకుంటే ని నిన్ను
తనివితీరా…………..!
నిలిపి తిని నీ మోమును,
నా హృదయ పందిరి లోన!
అంతర్ముఖుడినై గాంచెద
నిన్ను జీవితాంతము……!
– వాసు