అంతర్ముఖ షీలా
అనగనగా ఒక షీలా అనే అమ్మాయి తను పెద్ద కుటుంబంలో పుట్టింది ఆ అమ్మాయి మొదటి నుండి ఎవరితో మాట్లాడేది. కాదు ఏ ఫంక్షన్కు వచ్చేది కాదు. తన కుటుంబంలో ఎవరితోనీ మాట్లాడుతుందో తెలియదు .
తల్లిదండ్రి తప్ప మరో ప్రపంచం తెలియదు. తన సొంత మేనమామ వచ్చినా కూడా పలకరించేది కాదు. ఎదుటపడి మాట్లాడేది కాదు. మేనమామను నాతోనే మాట్లాడదు. అసలు ఆ అమ్మాయికి మాటలు వస్తాయో రావో అని వాళ్ళ మామయ్య అంటూ ఉండేవాడు.
ఎవరు ఏమైనా అనుకోని కానీ తన అంతర్ముఖ మధనం లోనే ఉండిపోయేది ఎవరి ఎదుటకు రాక ఎవరితో మాట్లాడకపోయేసరికి అందరూ కూడా వాళ్ళ మామయ్య చెప్పిందే నిజం అనుకున్నారు.
అలాంటిది తన అంతర్ముఖ మదనం తోనే ఆలోచనలు సృష్టించుకుని లోలోపల తన భావాలను రచనా రూపకంగా వ్యక్తపరుస్తూ చివరకు డాక్టర్ గా మారి అందరిలోకి వచ్చింది.
అప్పుడు తన మేనమామతో పాటు బంధు వర్గమంతా ఆశ్చర్యపోతూ ఎప్పుడు చూసినా అంతర్ముఖ మదనంలోనే జీవించే డాక్టర్ షీలా తన పేరు చెప్పుకుంటూ, మేము గర్వపడే విధంగా ఎదిగి ప్రథమ స్థానంలో నిలబడిందంటూ పొగడ్తలతో ప్రశంసిస్తూ ఆశీర్వదించారు.
డాక్టర్ షీలా మా అమ్మాయే అని గర్వంగా చెప్పుకునే స్థాయికి ఎదిగి నలుగురికి ఆదర్శంగా నిలిచింది. తనను చూసి ఇప్పటి పిల్లలంతా నేర్చుకోవాలని చెప్పుకుంటున్నారు.
–బేతి మాధవిలత